'స్పై' నిర్మాతతో గొడవపై క్లారిటీ ఇచ్చిన నిఖిల్..?

Anilkumar
కార్తికేయ 2 మూవీ తో పాన్ ఇండియా హీరోగా మారిన నిఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే నిఖిల్ మూడు పాన్ ఇండియా సినిమాలను కమిట్ అయ్యాడు. ఇక ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం 'స్పై'. ఎడిటర్ గ్యారీ బిహెచ్ఈ సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు. సుభాష్ చంద్రబోస్ మర్డర్ మిస్టరీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజశేఖర్ రెడ్డి, చరణ్ ఉప్పలపాటి ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక జూన్ 29న ఈ సినిమాను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు చిత్ర నిర్మాతలు. 


ఇలాంటి తరుణంలోని స్పై మూవీ నిర్మాతతో హీరో నిఖిల్ కి మధ్య అభిప్రాయ బేధాలు ఏర్పడ్డాయని గత రెండు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా స్పై మూవీ రిలీజ్, ప్రమోషన్స్ విషయంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదలను వాయిదా వేయాలని నిఖిల్ నిర్మాతల్ని కోరగా అందుకు నిర్మాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న తేదీకే సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. దీంతో నిఖిల్ ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రమోషన్స్ కి సైతం దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారట. దీంతో స్పై మూవీ రిలీజ్ ఇష్యూ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.


 తాజాగా దీనిపై హీరో నిఖిల్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. స్పై మూవీ సిజి వర్క్ ఇంకా పూర్తి కాలేదని, పోస్ట్ ప్రొటెక్షన్ పనులు కూడా పెండింగ్ లోనే ఉన్నాయని నిఖిల్ తెలిపాడు. అంతేకాదు ఇటువంటి గందరగోళ పరిస్థితుల్లో సినిమాను విడుదల చేయడం కరెక్ట్ కాదని నిఖిల్ భావిస్తున్నట్లు చెప్పాడు. స్పై సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ ప్లాన్ చేశారు. కాబట్టి అందుకు తగ్గ ప్రమోషన్స్ కూడా చేయాలి. దానికి పక్కా ప్రణాళికలతో ప్రచార కార్యక్రమాలను ప్లాన్ చేస్తే బాగుంటుందని నిఖిల్ నిర్మాతలకు విన్నవించగా.. నిర్మాతలు ఇందుకు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. దీంతో స్పై మూవీ రిలీజ్ వాయిదా వేయాలని నిఖిల్ ఈ సందర్భంగా కోరినట్లు తెలుస్తోంది. దీంతో నిర్మాతలు స్పై మూవీ విడుదలను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి కొత్త విడుదల తేదీని ప్రకటించాలని మేకర్స్ భావిస్తున్నారట...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: