అతనితో డేటింగ్ నిజమే.. క్లారిటీ ఇచ్చిన తమన్నా?
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న తమన్నా బాలీవుడ్ నటుడు విజయ వర్మతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే గత కొంతకాలం నుంచి సినిమాలలో తక్కువగా అవకాశాలు దక్కించుకుంటున్న తమన్న వెబ్ సిరీస్ లపై ఎక్కువగా దృష్టి పెట్టింది. ఇక అటు విజయవర్మ నాని హీరోగా నటించిన ఎంసీఏ సినిమాల్లో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. అయితే గత కొంతకాలం నుంచి వీరిద్దరూ ఎక్కడ చూసినా చట్టపట్టలేసుకొని తిరుగుతున్నారు.
కాగా గతంలో ఇక న్యూ ఇయర్ సమయంలో ఏకంగా తమన్నాకు విజయవర్మ ముద్దు పెట్టడం కూడా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే వీరి రిలేషన్షిప్ గురించి మాత్రం ఎక్కడ ఓపెన్ అవ్వలేదు. లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో డేటింగ్ గురించి క్లారిటీ ఇచ్చింది తమన్నా. బాలీవుడ్ నటుడు విజయవర్మతో రిలేషన్షిప్ నిజమే అంటూ ఒప్పుకుంది. లస్ట్ స్టోరీస్ 2 సెట్స్ లో తమ ప్రేమ కథ ప్రారంభమైందంటూ చెప్పింది. తోటి నటుడు అని విజయ్ ఇష్టపడలేదు. అతడు చాలా స్పెషల్. నాకు రక్షణగా నిలబడతాడని నమ్మకం ఉంది. మా మధ్య మంచి బంధం ఉంది. నన్ను కిందకు లాగే వారి నుంచి రక్షణ కల్పిస్తాడు. నాపై శ్రద్ధ వహిస్తాడు. ఇక అతను ఉన్నచోటే నాకు సంతోషకరమైన ప్రదేశం అంటూ తమన్న చెప్పుకొచ్చింది.