కమెడియన్ సప్తగిరి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి తప్పు చేస్తున్నారా..?
ఈ సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొంటూ సప్తగిరి మీడియాతో మాట్లాడడం జరిగింది.పొలిటికల్ గురించి మాట్లాడుతూ కేవలం ప్రజలకు సేవ చేయడం కోసమే తాను రాజకీయాల్లోకి వస్తున్నారంటే తెలిపారు. అయితే తాను తెలుగుదేశం పార్టీకి వస్తున్నానని తెలుగుదేశం పార్టీ అంటే చాలా ఇష్టం ఉంది అంటూ ఈ సందర్భంగా తెలియజేశారు సప్తగిరి.. 2024 ఎన్నికలలో తాను చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు తెలిపారు ఇప్పటికే తనకు టికెట్ కూడా కన్ఫర్మ్ అయ్యిందని చేసిన కామెంట్లు ఇండస్ట్రీలో వైరల్ గా మారుతున్నాయి.
తాను లోకేష్ చంద్రబాబు నాయుడు మాటలకు ఎంతో కట్టుబడి ఉన్నారని అవసరమైతే పార్టీ ప్రచార కార్యక్రమాలలో కూడా పాల్గొని రాష్ట్రమంతాట ప్రచార కార్యక్రమాలు చేపడతానని సప్తగిరి తెలియజేయడం జరిగింది.తాను టికెట్ కన్ఫర్మ్ అయ్యిందని చెప్పినటువంటి పోటీ చేస్తున్నారనే విషయంపై తెలియజేయలేదు కానీ వచ్చే ఎన్నికలలో మాత్రం తప్పకుండా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన కొంతమంది అభిమానుల సైతం సప్తగిరి సినిమాలలోని బాగా సంపాదిస్తూ ఉండేవారు పొలిటికల్గా వెళ్లి తన కెరీర్ ని నాశనం చేసుకుంటారంటూ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మరి సప్తగిరి ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే గెలుస్తారేమో చూడాలి మరి.