సంక్రాంతి బరి నుండి ఆ పాన్ ఇండియా మూవీ తప్పుకున్నాట్లేనా....??
కాగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించేసింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్ ను కూడా వదిలింది. అయితే ఇప్పుడు ఈ సినిమా చెప్పిన సమయానికి రాకపోవచ్చు అనే వార్తలు వినిపిస్తున్నాయి. నిన్న రవితేజ ఈగల్ సినిమా పోస్టర్ రిలీజైంది. అందులో సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు పెద్ద పెద్ద అక్షరాలను పొందుపర్చారు. కాగా ఆ సినిమాను పీపుల్ మీడియా బ్యానర్ నిర్మిస్తుంది. ఇక పీపుల్ మీడియా ప్రభాస్ కు చాలా క్లోజ్. ఇప్పటికే ప్రభాస్, మారుతి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాను నిర్మిస్తుంది. ఏ ప్రొడ్యూసర్ సహసం చేయలేని విధంగా ఆదిపురుష్ హక్కులను కోట్లు పెట్టి కొనుక్కుంది. అంతేకాకుండా ప్రభాస్ నెక్స్ట్ సినిమా స్పిరిట్ కు సహ-నిర్మాతగా కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇలా మూడు సినిమాలను టేకోవర్ చేసి ప్రభాస్ కు చాలా దగ్గరయ్యారు.
దాంతో ప్రాజెక్ట్ కే సంక్రాంతికి రాదనే సమాచారంతోనే పీపుల్ మీడియా వాళ్లు ఈగల్‌ను పండక్కి షెడ్యూల్ చేసినట్లున్నారు. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇక లేటెస్ట్ గా ప్రాజెక్ట్ కే సినిమా కోసం మ్యూజిక్ వర్క్ ను స్టా్ర్ట్ చేసినట్లు సంతోష్ నారాయణన్ వెల్లడించాడు. సై-ఫై జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాజ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. దీపిక పదుకొణె హీరోయిన్ గా నటిస్తుంది. వైజయంతీ బ్యానర్‌పై అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.