ఆ కారణంగా సమంతను పట్టించుకోని స్టార్ హీరోస్....!!

murali krishna
టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా ఎన్నో సినిమా ల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ సమంత. ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో తెలుగు మరియు తమిళం లో వరుస ఆఫర్లు దక్కించుకోవడం లేదు.కొందరు సమంత కి ఆఫర్లు వస్తున్నాయి కానీ ఆమె కమిట్ అవ్వడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఆమె కు బాలీవుడ్ పై మనసు పడ్డట్లుగా ఉంది.

అందుకే ఇకపై అన్ని సినిమా లు అక్కడే చేయాలని పూర్తి సమయం అక్కడే కేటాయించాలని భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక సమంత సౌత్ సినిమాల విషయానికి వస్తే స్వయంగా తెలుగు హీరోలు లేదా ఇతర సౌత్ హీరోలు ఆమె ను పట్టించుకోవడం లేదేమో అంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఉన్న బజ్ ప్రకారం సమంత తెలుగు లో కంటే ఎక్కువగా హిందీ లో సినిమా చేయాలని ఆశ పడుతోంది. అందుకే సమంత ఇక్కడ సినిమా ల్లో ఆఫర్లు వచ్చినా కూడా నో చెప్పింది. అయితే సమంత కు ఈ మధ్య కాలంలో ఏ ఒక్క స్టార్ హీరో సినిమా ల్లో కూడా ఛాన్స్ రాలేదు. స్టార్ హీరోల సినిమా లకు ఆమె జోడీ కాదు అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం ఆమె నాగ చైతన్య ను ప్రేమ వివాహం చేసుకుని బ్రేకప్ అయ్యింది. అందుకే తెలుగు హీరోలు ఆమె తో సినిమా లను చేసేందుకు ఒప్పుకునే పరిస్థితి లేదు అంటున్నారు. మొత్తానికి సమంత ను తెలుగు హీరోలు కొద్ది మంది మాత్రమే కోరుకుంటున్నారు. ఎక్కువ శాతం మంది మాత్రం ఆమె ను పట్టించుకోవడం లేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అసలు విషయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: