ఆ కమెడియన్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రగతి...!!
ఒక స్టార్ కమెడియన్ సెట్ లో నాతో బాగా మాట్లాడేవారని ఆ కమెడియన్ చాలా పద్ధతిగా ఉంటారని అయితే ఒకరోజు మాత్రం ఆ కమెడియన్ నాతో మిస్ బిహేవ్ చేశాడని ఆమె తెలిపారు. ఆ కమెడియన్ ఆ విధంగా ప్రవర్తించడాన్ని తాను అస్సలు జీర్ణించుకోలేకపోయానని ప్రగతి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ కమెడియన్ ప్రవర్తన వల్ల నా వర్క్ కూడా సరిగ్గా చేయలేకపోయానని ఆమె చెప్పుకొచ్చారు.
ఆరోజు నేను లంచ్ చేయలేదని ఆ ఘటన వల్ల చివరకు టీ తాగాలని కూడా నాకు అనిపించలేదని ఆమె పేర్కొన్నారు. ఆరోజు షూటింగ్ పూర్తైన తర్వాత ఆ కమెడియన్ ను క్యారవాన్ లోకి తీసుకెళ్లి నాతో మిస్ బిహేవ్ ఎందుకు చేశావని ప్రశ్నించానని నేను షూటింగ్ సమయంలోనే రియాక్ట్ అయ్యి ఉంటే నీ పరిస్థితి ఏంటని అడగడం జరిగిందని ప్రగతి కామెంట్లు చేశారు. మీరు కాబట్టి సైలెంట్ గా ఉండిపోయానని చెప్పానని ప్రగతి అన్నారు.
ప్రగతి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఆ కమెడియన్ పేరును మాత్రం ప్రగతి వెల్లడించలేదు. ప్రగతి పేరును చెప్పకపోవడం తో ఆ కమెడియన్ ఇతనేనంటూ వేర్వేరు కమెడియన్ల పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. రాబోయే రోజుల్లో అయినా ప్రగతి ఈ ప్రశ్నల కు సమాధానం చెబుతారేమో చూడాలి.