ఆ కారణంగా కీర్తి సురేష్ గొంతు నొక్కిన మెగా స్టార్...!!
తోటి నటీనటులతో కూడా బాగా సరదాగా కనిపిస్తూ ఉంటుంది.అయితే ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఆమె చిరంజీవి నటిస్తున్న బోళా శంకర్ సినిమాలో ఆయనకు చెల్లి పాత్రలో చేస్తున్న సంగతి తెలిసిందే.నిజానికి చిరంజీవి సినిమాలో అవకాశం అందుకుందంటే అది మామూలు విషయం కాదు.పైగా చెల్లెలి పాత్రలో చేస్తుందంటే ఆ పాత్రతో సినిమాకు ఖచ్చితంగా ముడి పడే ఉంటుంది.ఇక చిరంజీవి కూడా తోటి నటీనటులతో బాగా సరదాగా కనిపిస్తూ ఉంటాడు.ఈ వయసులో కూడా ఆయనలో కుర్రతనం అస్సలు పోలేదు.అయితే ఇదంతా పక్కన పెడితే చిరంజీవి ఎప్పుడు ఎవరిపై కోపంగా ఉన్నట్లు కనిపించడు.అసలు ఎవరిపై కోపాన్ని చూపించడు.కానీ తాజాగా కీర్తి సురేష్ పై కోపం చూపించినట్లు కనిపించడమే కాకుండా ఆమె గొంతు పట్టుకున్నట్లు కూడా కనిపించాడు.ఇంతకు అసలు విషయం ఏంటంటే.తాజాగా ఆ సినిమాకు సంబంధించిన ఒక పాట సెట్ లో చిరంజీవి అందరితో సరదాగా గడుపుతున్నట్లు ఒక వీడియోను తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.
అందులో తను తోటి నటీనటులతో సరదాగా కూర్చొని మాట్లాడుతున్నట్లు కనిపించాడు.అయితే తమన్నా, కీర్తి సురేష్ లతో కూడా చాలా ఫ్రీగా కనిపించాడు.ఆ సమయంలో కీర్తి సురేష్ ఏదో మాట అనటంతో వెంటనే చిరంజీవి ఆమె వైపు కోపంగా చూసి.ఆ తర్వాత గొంతు పట్టుకొని కనిపించాడు.ఇదంతా సరదాగా సాగిన దృశ్యం అని చెప్పాలి.ఇక చిరంజీవి అలా సరదాగా చేస్తుండటంతో కీర్తి సురేష్ నిజంగా చెల్లెలా కనిపించినట్లు అనిపించింది.