ఊర్వశి రౌతేలాకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజీ ఆఫర్స్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ ఊర్వసి రౌతేల గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుసగా ఐటమ్ సాంగ్ లలో ఆఫర్ లను దక్కించుకుంటుంది. ముందుగా ఈ నటికి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ లో అవకాశం దక్కింది. కాకపోతే ఈ మూవీ విడుదల కాకముందే ఈ ముద్దు గుమ్మ నటించిన అనేక తెలుగు సినిమాలు విడుదల అవుతూ వస్తున్నాయి.

అందులో భాగంగా మొదటగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా బాబీ దర్శకత్వంలో రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాలో ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ మూవీ ఇప్పటికే విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ ముద్దు గుమ్మ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అమాంతం పెరిగి పోయింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ మూవీ లో కూడా ఈ నటి ఐటమ్ సాంగ్ లో నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ ఈ నటికి మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ... సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో "బ్రో" మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఇందులో కూడా ఈ ముద్దు గుమ్మ ఐటమ్ సాంగ్ లో నటిస్తోంది. అలాగే రామ్ పోతినేని ... బోయపాటి శ్రీను సినిమాలో కూడా ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఐటెం సాంగ్ లో నటించింది. ఇలా ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుసగా ఐటమ్ సాంగ్ లలో అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: