పారితోషకం భారీగా డిమాండ్ చేస్తున్న సమంత...?

murali krishna
సమంత తన సినిమా కెరియర్ ను బాగా బ్యాలన్స్ చేసుకుంటుంది.మయోసైటిస్ అనే ప్రాణంతకమైన వ్యాధి బారిన పడింది. అయితే పర్సనల్ లైఫ్ లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కానీ వాటి ప్రభావం తన వృత్తి పై ఏ మాత్రం కూడా పడకుండా సమంత ఎంతో కష్టపడింది...
ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాల తో బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.. అలాగే రెమ్యునరేషన్ ను కూడా భారీగా నే డిమాండ్ చేస్తోందని సమాచారం.ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆ విషయంలో బాలీవుడ్ స్టార్స్ ను కూడా మించిపోతోంది. ఇంతకు ముందు ఒక్కో సినిమాకు నాలుగు నుంచి ఐదు కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకునే సమంత ఇప్పుడు రూ. 10 కోట్లపైకు పైగా అడుగుతుందని సమాచారం.
అడిగినంత ఇస్తేనే ప్రాజెక్ట్ పై సైన్ చేస్తానని కూడా గట్టిగా చెప్పేస్తుందట. ఇక సమంతకు నేషనల్ వైడ్ గా భారీ క్రేజ్ ఉంది. మంచి మార్కెట్ కూడా ఉంది. ఈ విషయాన్ని దృష్టి లో పెట్టుకునే నిర్మాతలు కూడా సమంత అడిగిన మొత్తం ఇచ్చేందుకు ఒప్పేసుకుంటున్నారని ప్రచారం అయితే జరుగుతోంది. కాగా సమంత చేతి లో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో `ఖుషి` కూడా ఒకటి. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మరియు సమంత కాంబోలో రూపుదిద్దుకుంటున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ సినిమా ఇది. అలాగే మరోవైపు బాలీవుడ్ లో రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో `సిటాడెల్` అనే వెబ్ సిరీస్ కూడా చేస్తోంది. ఇందు లో వరుణ్ ధావన్, సమంత జంటగా అయితే కనిపించబోతున్నారు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోందని సమాచారం.. ఇక రీసెంట్ గా సమంత ఓ హాలీవుడ్ మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది. అయితే ఆ వార్త గురించి అధికారిక ప్రకటన అయితే రాలేదు…

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: