కాజోల్ షాకింగ్ నిర్ణయం.. అంత కష్టం ఏమొచ్చిందో మరీ?

praveen
బాలీవుడ్ హీరోయిన్ కాజల్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. దిల్వాలే దుల్హనియా సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మా. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో ప్రేక్షకుల మనసు దోచేసింది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత తక్కువ సమయంలోనే బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో ఉన్న బడా హీరోస్ అందరితో కూడా జోడి కట్టింది ఈ ముద్దుగుమ్మ. ప్రతి ఒక్కరికి పర్ఫెక్ట్ జోడిగా పేరు సంపాదించుకొని.. ఎన్నో సూపర్ హిట్లను కూడా తన ఖాతాలో వేసుకుంది అని చెప్పాలి. ఇకస్టార్ హీరోయిన్గా కొనసాగుతూ కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే హీరో అజయ్ దేవగన్ ను  ప్రేమించి పెళ్లి చేసుకుంది.

 అయితే పెళ్లి తర్వాత ఇక అవకాశాలు వచ్చినా కొన్నాళ్లపాటు రిజెక్ట్ చేసింది. పిల్లలు, కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ కొంత సమయం ఇంటికే కేటాయించి ఇల్లాలుగా మారిపోయింది ఈ స్టార్ హీరోయిన్. కానీ ఓటీటి అందుబాటులోకి వచ్చిన తర్వాత మాత్రం మరోసారి వెబ్ సిరీస్ ల ద్వారా నటనను ప్రారంభించింది. త్రిభన్గ అనే వెబ్ సిరీస్ తో రీ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టింది. ఇక తర్వాత కొంతమంది స్టార్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలో కూడా నటించి ఆకట్టుకుంది అని చెప్పాలి. ఇప్పుడు వరుసగా వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతుంది ఈ సీనియర్ హీరోయిన్.

 అయితే సినిమాల్లో కనిపించక పోయిన పర్వాలేదు వెబ్ సిరీస్ ద్వారా అయినా సరే తమ అభిమాన హీరోయిన్ నటనతో అలరిస్తుంది అని అభిమానులందరూ కూడా సంతోషంలో మునిగిపోయారు. ఇక సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.అయితే ఇటీవల తన అభిమానులందరికీ కూడా ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. తాను సోషల్ మీడియాలకు కొన్నాళ్లపాటు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించింది. నా జీవితంలో కష్టతరమైన పరీక్షల్లో ఒకటి ఎదుర్కొంటున్న.. అందుకే సోషల్ మీడియాని కొద్దిగా బ్రేక్ తీసుకుంటున్నా ప్రకటించింది. కాజోల్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటి అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: