ప్రభాస్ తీరు పై సందేహాలు !

Seetha Sailaja

‘ఆదిపురుష్’ మూవీలో నటించిన ఒక్క ప్రభాస్ మినహా మిగతావారంతా ఉత్తరాది ప్రాంతం వారు మాత్రమే. అయితే ప్రభాస్ కు తెలుగు రాష్ట్రాలలో ఉన్న మ్యానియా రీత్యా ఈమూవీని తెలుగు ప్రజలు పూర్తిగా తెలుగు సినిమాగానే భావిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సుమారు లక్ష వరకు అభిమానులు తెలుగు రాష్ట్రాల నుండి తిరుపతికి రావడంతో ఈమూవీ ఈవెంట్ అత్యంత ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.
 
 
ఈ ఈవెంట్ తరువాత ప్రభాస్ ప్రముఖ మీడియా సంస్థలకు అదేవిధంగా ఛానల్స్ కు వివిడిగా ఇంటర్వ్యూలు ఇస్తారని చాలామంది భావించారు. అయితే జరిగిన వాస్తవం వేరు అని తెలుస్తోంది. ప్రభాస్ తన మూవీ ఓవర్సీస్ బయ్యర్ కు బాసటగా నిలవడానికి అమెరికా వెళ్ళినట్లు తెలుస్తోంది. అక్కడ రకరకాల ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రభాస్ తన మూవీ ప్రమోషన్ పై అమెరికాలో పూర్తిగా శ్రద్ధ పడతాడట.
 
 
అయితే ప్రభాస్ తెలుగు రాష్ట్రాలలో ఈమూవీకి సంబంధించిన పబ్లిసిటీని పట్టించుకోకుండా అమెరికాలో మాత్రం ప్రధాన నగరాలు అన్నీ కలయ తిరుగుతూ అక్కడ ‘ఆదిపురుష్’ ను ప్రమోట్ చేయడం ఎంతవరకు సమంజసం అంటూ మరికొందరు ప్రభాస్ ను టార్గెట్ చేస్తున్నారు. టాలీవుడ్ లో చాలమంది టాప్ హీరోలు చేయలేని పని ప్రభాస్ చేస్తున్నాడు అంటూ అతడి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈసినిమా మూవీ వెనుక టి సిరీస్ యాజమాన్యం ఉన్నప్పటికీ వారు తమ మూవీని ప్రమోట్ చేసే విషయంలో కొంతవరకు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాలలో ఊహించని మలుపుకు శ్రీకారం చుడుతుందా అంటూ మరికొందరు విశ్లేషణలు చేస్తున్నారు.
 
 ఇప్పటికే ఈమూవీకి సంబంధించిన పాటలలో ‘జై శ్రీరామ్’ పాటకు విపరీతమిన్ క్రేజ్ వచ్చినప్పటికీ ప్రభాస్ తాను పుట్టిన ప్రాంతాన్ని పట్టించుకోకుండా అమెరికా వెళ్ళి అక్కడ ఏమేరకు తన వ్యూహాలతో సక్సస్ కొట్టగలడు అన్న కామెంట్స్ కూడా ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీలో ఏది ఎలా ఉన్నా ప్రభాస్ తన సినిమాను పూర్తిగా ప్రమోట్ చేయలేదు అన్న విమర్శలు వస్తున్నాయి..
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: