ఎన్టీఆర్ కొత్త యాడ్ మాములుగా లేదు గా..?

murali krishna
జూనియర్ ఎన్టీఆర్ ప్రతిభ ఉన్న టాలెంటెడ్ హీరోల లో ముందు ఉంటారు. ఈ మధ్య కాలం లో ఎన్టీఆర్ ప్రముఖ కంపెనీల యాడ్స్ లో నటిస్తుండ గా ఆ యాడ్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్న విషయం తెలిసిందే.కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్ మెక్ డొనాల్డ్స్ యాడ్ లో నటిస్తున్నట్టు వార్తలు ప్రచారంలో కి రాగా తాజాగా ఆ యాడ్ విడుదలైందని సమాచారం.
ఎన్టీఆర్ తన ఫ్రెండ్స్ తో కలిసి చికెన్ తినడానికి వెళ్లగా మేనేజర్ సార్ ఇది క్లోజింగ్ టైమ్ అని అయితే చెబుతాడు. ఎన్టీఆర్ వెంటనే అగ్గిపెట్టె తీసుకుని అగ్గిపుల్లను వెలిగించగా చంద్రుడు సూర్యుడి లా మారిపోవడం విశేషం. ఎన్టీఆర్ మేనేజర్ తో సార్ ఇది ఓపెనింగ్ టైమ్ అని చెప్ప గా ఎలా సాధ్యమైందని మేనేజర్ అడుగుతాడు. ఎన్టీఆర్ వెంటనే "మెక్ డొనాల్డ్స్ మెక్ స్పైసీ చికెన్ షేర్స్.. స్పైసీ ని మీరు వివరించలేరు..షేర్ చేసుకోవాలి" అనే పంచ్ డైలాగ్ తో యాడ్ ను అయితే ముగించారు.
ఈ యాడ్ లో ఎన్టీఆర్ లుక్ కొత్తగా ఉందని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కొత్త యాడ్ తో మెక్ డొనాల్డ్స్ కు కచ్చితంగా ప్లస్ అవుతుంది. మెక్ డొనాల్డ్స్ ఇండియా అధికారిక యూట్యూబ్ ఛానల్ లో ఈ వీడియోను పోస్ట్ చేయగా ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా తో చాలా బిజీగా ఉన్నారు. రాజమౌళి డైరెక్షన్ లో నటిస్తే తర్వాత సినిమా ఫ్లాప్ అవుతుందని ఇండస్ట్రీ లో సెంటిమెంట్ అయితే ఉంది. ఈ సెంటిమెంట్ ను ఎన్టీఆర్ కచ్చితం గా బ్రేక్ చేసి దేవర సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు.ఎన్టీఆర్ కు రాబోయే రోజుల్లో కెరీర్ లో బెస్ట్ హిట్స్ దక్కాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: