అద్భుతమైన కథనంతో వస్తున్న ఫహద్ ఫాజిల్..!

Divya
మలయాళ హీరో ఫహద్ ఫాజిల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. పుష్ప సినిమాలో విలన్ గా నటించి మంచి పాపులారిటీ సంపాదించారు.  ఆ తర్వాత మలయాళంలో విడుదలైన పలు చిత్రాలను తెలుగులో కూడా డబ్ చేసి  విడుదల చేసి మంచి పాపులారిటీ సంపాదించారు. అందుకే ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే పెరిగిపోయింది. మలయాళం లోనే కాకుండా ఇతర భాషలలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉన్నది.ఆయనకు పాత్ర నచ్చితే కేవలం హీరో గానే కాకుండా విలన్ గా కూడా నటించడానికి సిద్ధంగా ఉన్నారు.
తాజాగా సరికొత్త విభిన్నమైన కథాంశంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు ఫహద్ ఫాజిల్.. తాను నటించిన చిత్రం ధూమం.. ఈ సినిమాకి కన్నడ డైరెక్టర్ పవన్ కుమార్ దర్శకత్వం వహించారు.. కే జి ఎఫ్,  కాంతారా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన హొంబలే బ్యానర్ పైన ఈ సినిమాని నిర్మిస్తూ ఉండడంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేయడం జరిగింది.. ఇక ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే స్మోకింగ్ వార్నింగ్ గురించి యాడ్ ని ఫహద్ ఫాజిల్ వివరిస్తున్నట్లుగా ట్రైలర్ లో మొదట చూపించడం జరిగింది.
అయితే ఈ ట్రైలర్ లో చాలా ట్విస్టులు, యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయని ప్రతి సీను చాలా ఇంట్రెస్టింగ్ గా ఆత్రుతగా ఉండేలా కనిపిస్తోంది.  మరి ట్రైలర్ ఇలా ఉంటే సినిమా ఎలా ఉంటుందో అంటూ పలువురు అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. డైరెక్టర్ పవన్ కుమార్ గతంలో యూటర్న్ , కుడిఎడమైతే వంటి చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం జూన్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో హీరోయిన్గా అపర్ణ బాలమురళి నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: