చిరంజీవి... పవన్... ఎన్టీఆర్... రవితేజ మూవీల షూటింగ్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలు అయినటువంటి చిరంజీవి , పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ , రవితేజ లకు సంబంధించిన మూవీ ల షూటింగ్ లు ప్రస్తుతం జరుగుతున్నాయి. అవి ఏ ప్రదేశాలలో జరుగుతున్నాయి ... ప్రస్తుతం ఏ సన్నివేశాలను మూవీ బృందాలు చిత్రీకరిస్తున్నాయో తెలుసు కుందాం.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వం లో రూపొందుతున్న భోళా శంకర్ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... కీర్తి సురేష్ , సుశాంత్ ఈ మూవీ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ యొక్క షూటింగ్ హైదరాబాదులో జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ బృందం చిరంజీవి ... తమన్నా ... కీర్తి సురేష్ లపై ఒక సాంగ్ ను చిత్రీకరిస్తుంది.

పవన్ కళ్యాణ్ ... సాయి ధర మ్ తేజ్ లు హీరోలుగా "బ్రో" అనే సినిమా రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. సముద్ర ఖని ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాదు లో జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ బృందం ఊర్వసి రౌతల పై ఒక ప్రత్యేక సాంగ్ ను చిత్రీకరిస్తుంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ యొక్క షూటింగ్ హైదరాబాదు లో జరుగుతుంది.

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం ఈగల్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు . ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాదులో జరుగుతుంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం రవితేజ పై సన్నివేశాలను చిత్రీకరిస్తుంది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: