వరుణ్ తేజ్ కొత్త మూవీ విడుదల తేదీ ప్రకటన..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ నటుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ముకుందా అనే మూవీ తో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించకపోయినప్పటికీ ఈ నటుడు తన నటనతో ... లుక్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. దానితో ఆ తర్వాత కూడా ఈ హీరోకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న.సినిమాలలో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాలలో హీరోగా నటించిన ఈ యువ నటుడు తొలిప్రేమ , ఫిదా , గద్దల కొండ గణేష్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.
 

ఇది ఇలా ఉంటే ఆఖరుగా వరుణ్ "గని" అనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ లో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశ పరిచింది. దానితో గని సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ యువ నటుడు "గాందేవదారి అర్జున" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది.

ఈ సంవత్సరం ఆగస్టు 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ని విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఈ మూవీ బృందం తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో వరుణ్ బ్లాక్ కలర్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని చేతిలో ఒక గన్ను ను పట్టుకొని స్టైలిష్ లుక్ లో కూర్చొని ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: