ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలుసా..!?

Anilkumar
నిన్న ఆది పురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. ఇక ఈ సినిమాకి దేవుడు హిందూ సెంటిమెంటును జోడించారు చిత్ర బంధం. అందుకే డివోషనల్ సిటీ అయిన తిరుమలని ఎంచుకొని ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అక్కడ జరిపారు చిత్ర యూనిట్. ఇక ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి లక్షల్లో అభిమానులు తరలివచ్చారు. జెండాలు పట్టుకొని టీషర్ట్స్ ధరించి జైశ్రీరామ్ నినాదాలతో లక్షల్లో ప్రభాస్ అభిమానులు ఈ ఈవెంట్ కి రావడం జరిగింది.ఈ క్రమంలోనే ఈ సినిమా డైరెక్టర్ మాట్లాడుతూ రామాయణ కథ ప్రదర్శించే ప్రతి చోటా హనుమంతుడు వస్తాడని మా అమ్మ చెప్పింది. 

కాబట్టి నిర్మాతలకు నా చిన్న రిక్వెస్ట్.ఆది పురుష్ సినిమా ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీట్ ఖాళీగా హనుమంతుని కోసం ఉంచాలని కోరాడు. వినడానికి ఇది కొంచెం వింతగా ఉన్న ఇది హిందువులను థియేటర్స్ కి నడిపించే ప్రయత్నం కావచ్చు,అని కొందరు అంటున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నిర్మతలు ఏకంగా 2.5 కోట్లు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు కేవలం బాన సంచా కోసం 50 లక్షలు కేటాయించారు నిర్మాతలు. ఇక ప్రభాస్ వేదిక  వద్దకు వచ్చే సమయంలో పెద్ద ఎత్తున బాణ సంచా నిర్వహించారు.

 కేవలంప్రీ రిలీజ్ ఈవెంట్ కి మాత్రమే కోట్లు ఖర్చు చేయడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ  ఈవెంట్ ని నిర్వహించారు. ఈ క్రమంలోనే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ కూడా దక్కాయి. అంతేకాదు సినిమా కూడా ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉంటే సినిమా కలెక్షన్స్ ఇంకా బాగుండే అవకాశాలు సైతం కనిపిస్తున్నాయి. ఇక ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా జూన్ 16న వరల్డ్ వైడ్ గా ఐదు భాషల్లో విడుదల కానుంది. కాగా ఈ సినిమాలో ప్రభాస్ రాఘవుడిగా నటించగా కృతి సనన్ జానకి పాత్రలో నటించిన..లంకేశ్వరుడు పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: