ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాని సైఫ్ అలీ ఖాన్.. అదే కారణమా..!?

Anilkumar
ప్రస్తుతం  దేశ వ్యాప్తంగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమానే. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న ఈ మైథాలజికల్ సినిమా రామాయణ నేపథ్యంలో రాబోతోంది. ఇక బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన ఓం రౌత్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తున్నాడు. కాగా సీత పాత్రలో కృతి నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు టీజర్లు ట్రైలర్ ద్వారా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో ఘనంగా జరిగింది.

కాగా ఈ వెంట్ కి ఆది పురుష్ చిత్ర బృందం మొత్తం వచ్చారు. ముఖ్యఅతిథిగా చిన్న జీయర్ స్వామి వచ్చి చిత్ర బృందాన్ని అందరినీ ఆశీర్వదించడం జరిగింది. కాగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే ఈ సినిమాలో లంకేష్ గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్లు కీలక పాత్రలో నటించిన నటీనటులు తోటి నటినట్లు అందరూ కూడా ఈ ఈవెంట్ కి రావడం జరిగింది. కానీ ఈ సినిమాలో ముఖ్యపాత్రలో లంకేష్ పాత్రలో నటించిన సైఫ్ అలీ ఖాన్ మాత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఎక్కడ కూడా కనిపించలేదు.

దీంతో సైఫలీ ఖాన్ ఈ ఈవెంట్ కి రాకపోవడంతో ప్రేక్షకుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన ఆది పురుష్ ప్రమోషన్స్లో మరియు నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా సైఫ్ అలీ ఖాన్ ఎక్కడ కూడా కనిపించలేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు సైఫ్ అలీ ఖాన్ ముందు నుంచి చాలా బిజీ నటుడు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అంతేకాదు కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవరా సినిమాలో కూడా సైఫలి ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడట. అయితే ఈ కారణం చేత సైఫలీ ఖాన్ ఆది పురుష్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేదని అంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: