పెళ్లి పై సంచలన వ్యాఖ్యలు చేసిన షాహిద్ కపూర్..!?

Anilkumar
పెళ్లి గురించి చాలామంది చాలా రకాలుగా చెబుతూ ఉంటారు. పెళ్లంటే రెండు మనసులు అని..  నూరేళ్ల జంటగా జీవించేందుకు ముందడుగు అని.. ఇలా బోలెడు చెబుతూ .ఉంటారు కానీ బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ మాత్రం పెళ్లికి ఒక సరికొత్త అర్ధాన్ని చెప్పి షాక్ ఇచ్చాడు. అబ్బాయిని సరైన దారిలో పెట్టేందుకు ఓ అమ్మాయి అతని జీవితంలోకి రావడమే వివాహం అని పెళ్లికి ఒక సరికొత్త డెఫినేషన్ చెప్పాడు.ఇక షాహిద్ కపూర్ చెప్పిన మాటలు విన్న నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఇక ప్రస్తుతం షాహిద్ కపూర్ బ్లడీ దాడి అని సినిమా ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. 

ఈ క్రమంలోనే పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నాడు షాహిద్ కపూర్. ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వివాహం అనేది ఒకే ఒక దానికి ఆధారపడి ఉంటుంది. అదేంటంటే జీవితంపై ఒక క్లారిటీ లేని అబ్బాయి లైఫ్ లోకి అమ్మాయి వచ్చి ఆయన సమస్యలను పరిష్కరించి తనని ఓ దారిలో పెట్టడమే పెళ్లి ..ఆ అమ్మాయి వల్లే అతడు బాధ్యత గల వ్యక్తిగా మారగలుగుతాడు. అంటూ పెళ్లికి ఒక సరికొత్త నిర్వచనం చెప్పాడు షాహిద్ కపూర్. ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగడం పెళ్లి కాదా ఒకరినొకరు సర్దుకుపోవడమే పెళ్లా.. ఇది ఎక్కడ విచిత్రం అంటూ

షాహిద్ కపూర్ చేసిన వ్యాఖ్యలకి సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు నేటిజన్స్. అంతేకాదు ఏంటి బాబు మరోసారి చెప్పు అంటే మీ అమ్మ అదే పని చేసిందా నిన్ను సరిగా పెంచిందా లేదా.. మీకు ఇంకా బుర్ర ఎదగలేదా.. అంటూ షాహిద్ కపూర్ పై మండిపడుతున్నారు. అంతేకాదు ఆడవాళ్లు అంటే మిమ్మల్ని పెంచుతూ మిమ్మల్ని బాగుచేసే నర్సులు అని మీ అభిప్రాయమా.. అంటూ నటిజన్స్ షాహిద్ కపూర్ నీ ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు నువ్వు కబీర్ సింగ్ అర్జున్ రెడ్డి రీమేక్ సినిమాలో నటించావు. ఆ సంగతి మా అందరికీ తెలుసు. కానీ ఇప్పటికీ నువ్వు ఆ సినిమాలోని పాత్రలో నుండి ఇంకా బయటకు రాలేనట్టుంది అంటూ షాహిద్ కపూర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: