ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ బాడీగార్డ్స్ కోసం అన్ని లక్షలు ఖర్చు చేసారా..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మరియు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్లో వచ్చిన  మైథాలజికల్ సినిమా ఆదిపురుష్. రామాయణం ఆధారంగా ఈ సినిమాని దాదాపుగా 500 కోట్ల బడ్జెట్ తో తెరక్కిస్తున్నారు.అయితే ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా సీతగా కృతి సనన్.. రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. కాగా ఈ సినిమా జూన్ 16న పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిన్న రాత్రి తిరుపతిలో ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో ఎప్పుడు జరగనంత ఘనంగా దాదాపుగా రెండున్నర కోట్లకు పైగానే ఖర్చు చేసి ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు.

 కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆధ్యాత్మిక గురువు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి రావడం జరిగింది. అలాగే ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన ప్రభాస్ కృతి  తోపాటు చిత్ర బృందం మొత్తం కూడా ఈవెంట్లో పాల్గొన్నారు. ఆది పురుష్ సెకండ్ ట్రైలర్ ని కూడా విడుదల చేశారు చిత్ర బృందం .ఈ క్రమంలోనే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది .అదేంటంటే ఈ ఈవెంట్ లో ప్రభాస్ సెక్యూరిటీ ఖర్చు తెలిస్తే షాక్ అవుతారు. అయితే ప్రభాస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి

మొత్తం వెయ్యి మందికి పైగానే పోలీసు బందోబస్తులు గా వచ్చారు. అలాగే మరొక వెయ్యి మంది ట్రాఫిక్ మరియు జనాలు మానిటరింగ్ చేశారు. దాంతోపాటు ప్రత్యేకంగా ప్రైవేట్ సెక్యూరిటీ మరియు బాంబు స్క్వాడ్ ని కూడా ప్రభాస్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పోలీసుల సెక్యూరిటీ కాకుండా ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసేందుకు నిర్మాతలకు 25 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది. దీంతో ఇప్పుడీ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: