పెళ్లి అనేది ఒక బూతు.. సంచలన వ్యాఖ్యలు చేసిన వరలక్ష్మీ..?

Anilkumar
కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో మంచి పాపులారిటీని తెచ్చుకుంది. ముఖ్యంగా ఆగ్రహీరోల సినిమాల్లో లేడీ విలన్ పాత్రలో మెప్పిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. క్రాక్, వీర సింహారెడ్డి వంటి సినిమాల్లో వరలక్ష్మి విలనిజానికి ఆడియన్స్ అంతా షాక్ అయిపోయారు. ఆ రేంజ్ లో అదరగొట్టింది ఈ కోలీవుడ్ భామ. ప్రస్తుతం తెలుగుతోపాటు  తమిళంలోనూ వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇక వయసు పెరుగుతున్నా ఈ అమ్మడు ఇంకా పెళ్లి మాత్రం చేసుకోవడం లేదు. ప్రజెంట్ సింగిల్గానే తన లైఫ్ లీడ్ చేస్తోంది. ఇటీవల కోలీవుడ్ హీరో విశాల్ తో వరలక్ష్మి ప్రేమలో ఉందని, పెళ్లి కూడా చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపించాయి. 

కానీ ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తేలిపోయింది. అయితే వరలక్ష్మీ తాజాగా యాంకర్ ఓంకార్ పోస్ట్ చేస్తున్న సిక్స్త్ సెన్స్ ప్రోగ్రాం కి హాజరైంది. ఈ ప్రోగ్రాంలో వరలక్ష్మితో పాటు బిందు మాధవి కూడా సందడి చేసింది. అయితే ఓంకార్ ఇద్దరికీ పెళ్లి పై ఓ ప్రశ్న అడిగాడు. ఇక ఈ ప్రశ్నకి వరలక్ష్మి స్పందిస్తూ.. క్రాస్ ఫింగర్ ని చూపించింది. అంటే తన దృష్టిలో పెళ్లి అంటే ఒక బూతు అని చెప్పింది. "పెళ్లి అనేది అన్నిటికీ పరిష్కారం అనుకుంటాం. కానీ కాదు. మన పార్ట్నర్ ను అర్థం చేసుకునే మైండ్ డెవలప్మెంట్ ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి. అంతేకానీ తొందరపడి పెళ్లి చేసుకోవద్దు" అంటూ తెలిపింది వరలక్ష్మి.

ఇక ఆ తర్వాత బిందు మాధవి స్పందిస్తూ ఎవరో తొందర పెడితే పెళ్లి చేసుకోవద్దు. మనకు నచ్చినప్పుడు మాత్రమే చేసుకోవాలి అంటూ తెలిపింది. అయితే ఇందులో పెళ్లిపై వరలక్ష్మి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వరలక్ష్మి కామెంట్స్ కి నేటిజన్స్ సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగులో హనుమాన్ అనే సినిమాలో కీలక పాత్ర పోషించింది. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో తేజ సజ్జ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: