నిత్యామీనన్ ని దారుణంగా అవమానించిన స్టార్ హీరో..!?

Anilkumar
టాలీవుడ్, కోలీవుడ్ అన్న తేడా లేకుండా రెండు సినీ ఇండస్ట్రీలో కూడా హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది నిత్యమీనన్. హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతో పెద్దగా గుర్తింపు తెచ్చుకో లేకపోయినప్పటికీ అలా మొదలైంది అనే సినిమా ద్వారా హీరోయిన్ గా కొనసాగింది. ఇక ఈ సినిమాతో నిత్యమీనన్ కి టాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చాయి. అనంతరం చాలామంది స్టార్ హీరోల సరసన నటించింది ఈమె .ముఖ్యంగా  ఈ రెండు సినీ ఇండస్ట్రీలో కూడా హీరోయిన్గా కొన్ని రోజులు ఒక వెలుగు వెలిగింది. అలాంటి ఈమె ఈ మధ్యకాలంలో అసలు సినిమాల్లో కనిపించడం మానేసింది. 

వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నప్పటికీ చాలా తక్కువగా కనిపిస్తోంది. అంతేకాదు పాత డిమాండ్ చేయడం వల్ల లెస్బియన్ పాత్రలో సైతం నటించి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చింది నిత్యమీనన్. హీరోయిన్గా ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా గ్లామర్ పాత్రలో నటించకుండా సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూ తనకంటూ ఒక మంచి పేరును సంపాదించుకుంది నిత్యమీనన్. ఇక అలాంటి నిత్యమీనన్ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఒక హీరో తనని పొట్టి దాన పొట్టి దాన అంటూ అవమానిస్తూ ఉండేవాడట. అయితే ఆ హీరో మరెవరో కాదు మన నేచురల్ స్టార్ నాని.

వీరిద్దరి కాంబినేషన్లో అలా మొదలైంది సినిమా వచ్చి ఎంతటి హిట్ గా నిలిచిందో మనందరికీ తెలిసిందే.ఆ సినిమాతో ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ సినిమా ద్వారానే నిత్యమీనన్ ని నాని పొట్టి దాన పొట్టి దాన అంటూ పిలుస్తూ ఉండేవాడట. అయితే ఒకసారి అందరి ముందు అలా పిలిచేసరికి అవమానంగా ఫీల్ అయిన నిత్యామీనన్ షూటింగ్ సెట్ లో  అందరూ చూస్తుండగానే బకెట్ నీళ్ళు తీసుకొచ్చి కోపంతో నాని పై పోసేసిందట. ఇక నిత్యామీనన్ నాని చేసిన హంగామాకి అక్కడ ఉన్న వారందరూ నవ్వుకున్నారట. ఇప్పటికీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమాలు వస్తే చూడాలని ఎదురుచూస్తున్నారు వేరే ఫ్యాన్స్ ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: