ఒక్క పాట కోసం ఊర్వశి అన్ని కోట్లు తీసుకుంటుందా..!?

Anilkumar
ఊర్వశి రౌతెల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కూడా ఈమెదే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.మరి ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఈమె  పేరు జోరుగా వినపడుతోంది. అయితే హీరోయిన్గా కాదు స్పెషల్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించే పనిలో బిజీగా మారింది ఊర్వశీ. మెగాస్టార్ చిరంజీవి మరియు రవితేజ కాంబినేషన్ లో వచ్చిన మల్టీ స్టార్ వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ అంటూ మెగాస్టార్ చిరంజీవితో స్టెప్లేసి అందరికీ దగ్గరయింది ఈ ముద్దుగుమ్మ. 

దానితోపాటు రామ్ పోతినేని బోయపాటి కాంబినేషన్లో వస్తున్న మరొక సినిమాలో ఉంది.ఆ సినిమాలో కూడా ఒక సాంగ్ చేసింది ఈమె.ఇటీవల అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమాలో కూడా స్టెప్లేసి షాక్ ఇచ్చింది ఈమె. దీంతో పాటు తెలుగులో స్పెషల్ సాంగ్స్ కోసం దర్శక నిర్మాతలు అందరూ కూడా ఊర్వశిని తీసుకునేందుకు క్యూ కడుతున్నారు. ఇక స్పెషల్ సాంగ్స్ కు తగ్గట్టుగానే భారీ రెమ్యూనరేషన్ కూడా డిమాండ్ చేస్తూ ఉందట ఈమె. అంతేకాదు ఆమె డిమాండ్ చేసినంత రెమినరేషన్ సైతం ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు దర్శక నిర్మాతలు.

 అయితే ఈ ముద్దుగుమ్మ ఒక్క స్పెషల్ సాంగ్ లో చేయడానికి దాదాపుగా మూడు కోట్ల వరకు చార్జర్ చేస్తుంది. వాల్తేరు వీర సినిమాలో బాస్ పార్టీ కోసం ఒక స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్ కు తగ్గ రెమ్యూనికేషన్ తీసుకుందట ఈమె. తెలుగులో పూజా హెగ్డే రష్మిక మందన లాంటి స్టార్ హీరోయిన్లు ఐదు కోట్ల వరకు ఒక సినిమాకి తీసుకుంటున్నారు .ఇక అలాంటి స్టార్ హీరోయిన్స్ తీసుకుంటున్న రేంజ్ లో ఈ బాలీవుడ్ బ్యూటీ కేవలం మూడు నిమిషాల పాటకు మాత్రమే మూడు కోట్లకు పైగానే డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే తాజాగా ఈమె ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ తో జతకట్టబోతోంది అన్న వార్తలు వినపడుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: