ప్రభాస్ మరియు కృతి సనన్ కాంబినేషన్ లో వచ్చిన ఆది పురుష్ సినిమా త్వరలోనే రాబోతుంది. ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న తిరుపతిలో చాలా ఘనంగా జరిగింది.ఈ క్రమం లొనే నిన్న ఉదయాన్నే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు చిత్ర బృందం. కానీ కృతి మాత్రం చిత్ర బృందంతో కలిసి దర్శించుకోలేకపోయింది. అందుకుగాను ఈవెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఆ రోజు రాత్రి తిరుమలలోనే ఉండి మరుసటి రోజు ఉదయాన్నే శ్రీవారిని దర్శించుకుంది. ఇక ఆమెతోపాటు డైరెక్టర్ ఓం రావత్ మరియు మూవీ టీం కూడా మళ్లీ దర్శనంలో పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే దర్శకుడు ఓం రౌత్ చేసిన పనిపై మండిపడుతున్నారు నేటిజన్స్. అయితే ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తరువాత గుడి వెలుపల కృతీసనకు సెండ్ ఆఫ్ ఇచ్చాడు దర్శకుడు. ఈ క్రమంలోనే ఆమెని హత్తుకొని ముద్దులు కూడా పెట్టారు. అనంతరం కృతి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అయితే అలా తిరుమలలో శ్రీవారి ఆశీర్వాదం చేసి శేష వస్త్రాలు వంటిపైనే ఉండగానే ముద్దులు హగ్గులు చేసుకోవడంతో భక్తులు వారిద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు వాటికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో డైరెక్టర్. పై మండిపడుతున్నారు నేటిజన్స్.
దేవుడు సన్నిధిలో ఈ గలీజ్ పనులు ఏంటి అంటూ ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు.. పవిత్రమైన స్థలంలో ఇలాంటి పనులు ఏంటి అని దర్శకుడుని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఈ విషయంపై బిజెపి నేతలు సైతం ఘాటుగా స్పందించారు. తిరుమల ఒక ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం అని ఇది పిక్నిక్ స్పాట్ కాదు అని షూటింగ్స్ స్పాట్ అంతకన్నా కాదు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గుడి సమక్షంలో ఇలాంటి పనిచేసినందుకు ఓమ్ రౌత్ తో పాటు కృతి సైతం బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో దీనికి సంబంధించిన వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!