"మేము ఫేమస్" మూవీకి 11 రోజుల్లో వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న సుమంత్ ప్రభాస్ అనే యువ నటుడు తాజాగా మేము ఫేమస్ అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఇతను ఈ మూవీ లో హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు స్వీయ దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ తోనే ఈ యువ నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా విడుదలకు ముందే ఈ మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి. దానితో ఈ మూవీ మంచి అంచనాలు నడుమ ధియేటర్ లలో కొన్ని రోజుల క్రితమే విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమా 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 12 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ను వివరాలను తెలుసుకుందాం.

ఈ మూవీ 1 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 86 లక్షల కలెక్షన్ లను వసూలు చేయగా , 2 వ రోజు 79 లక్షలు , 3 వ రోజు 76 లక్షలు , 4 వ రోజు 41 లక్షలు , 5 వ రోజు 37 లక్షలు , 6 వ రోజు 33 లక్షలు , 7 వ రోజు 27 లక్షలు , 8 వ రోజు 24 లక్షలు , 9 వ రోజు 33 లక్షలు , 10 వ రోజు 31 లక్షలు , 11 వ రోజు 14 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా 11 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపు కొని 2.40 కోట్ల షేర్ ... 4.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ 11 రోజుల్లో ఈ సినిమా రిమైనింగ్ ప్రాంతాల్లో 1.40 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా 11 రోజులకు గాను ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్ల షేర్ ... 6.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: