ఎన్టీఆర్ వద్దనుకున్న కథతో మహేష్ తో సినిమా చేస్తున్న త్రివిక్రమ్..!!

murali krishna
సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ సినిమా గుంటూరు కారం..మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుంది.. ఇందులో మహేష్ బాబుకు జోడిగా బుట్టబొమ్మ పూజా హెగ్డే అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్లుగా అయితే నటిస్తున్నారు. జగపతిబాబు ఇందులో ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధా కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని సమాచారం... ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా రోజులు అయితే అయ్యింది.. అయితే కొన్ని కారణాల వల్ల షూటింగ్ వాయిదాల మీద వాయిదా పడుతూ వచ్చింది.
ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా ప్రారంభమైంది. ఇటీవలె ఈ చిత్రానికి `గుంటూరు కారం’ టైటిల్ ను లాక్ చేస్తూ ఫస్ట్ గ్లింప్స్ ను కూడా విడుదల చేశారు..సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్బంగా సినిమా నుంచి వచ్చిన అప్డేట్ ఫ్యాన్స్ బాగా అలరించింది.ఇక ఇదే సమయంలో గుంటూరు కారంకు సంబంధించి ఓ షాకింగ్ వార్త నెట్టింట బాగా వైరల్ గా మారింది… అదేంటంటే.. ఈ సినిమా గురించి ఒక షాకింగ్ వార్త సోషల్ మీడియాలో బాగా ప్రచారం అవుతుంది...
ఓ టాలీవుడ్ స్టార్ హీరో ఈ సినిమా కథను రిజెక్ట్ చేశారని, ఆ తర్వాత మహేష్ దగ్గరకు ఆ కథ వెళ్లిందని సమాచారం... ఇంతకీ గుంటూరు కారంను రిజెక్ట్ చేసిన ఆ హీరో కాదు .. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని తెలుస్తుంది.దాన్ని మహేష్ వినిపించడం తో ఆయన ఓకే చేశారని సమాచారం.ఇక ఎన్టీఆర్ కు త్రివిక్రమ్ ఓ కథను కూడా వినిపించాడని కానీ, ఆ కథ ఎన్టీఆర్ ను మాత్రం మెప్పించలేకపోయింది. అదే సమయంలో కొరటాల శివ చెప్పిన కథ నచ్చడంతో.. ఎన్టీఆర్ వెంటనే ఆయన కథను ఓకే చేసాడని సమాచారం...వీరిద్దరి కలయికలో ప్రస్తుతం `దేవర సినిమా తెరకెక్కుతోంది. ఇక ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథతోనే త్రివిక్రమ్ మహేష్ బాబుకు చెప్పి మరీ ఆయనను సినిమాకు ఒప్పించాడని ప్రచారం అయితే జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: