సొంతంగా నిర్మాణ సంస్థ స్టార్ట్ చేయనున్న ఎన్టీఆర్..!?

Anilkumar
పాన్ ఇండియా హీరో గా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా క్రెజ్ సంపాదించుకున్నాడు ఎన్టీఆర్.ఆ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా  పాపులారిటీని అందుకున్నాడు. అంతేకాదు ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఒక దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి అనిరుద్ సంగీతాన్ని అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తున్నారు. 

ఇక జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది .అయితే తాజా సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక విషయం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అన్న వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే స్టార్ హీరోలకు సపరేట్ ప్రొడక్షన్ హౌస్ లో ఉన్నయి. ఇటీవల రామ్ చరణ్ కూడా కొత్తగా ఒక బ్యానర్ను స్థాపించారు. అలాగే ప్రభాస్కి యు వి క్రియేషన్స్ మహేష్ బాబుకి ఎం బి వంటి సంస్థలు ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే.

అయితే తాజాగా ఎన్టీఆర్ కూడా ఒక సొంత సంస్థను స్థాపించనున్నారని అంటున్నారు. ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా కొత్త సినిమాలు నిర్మిస్తూ కొత్త టాలెంట్ ని ఆయన ప్రోత్సహించబోతున్నారు అన్న వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయట. అంతేకాదు ఎన్టీఆర్ నిర్మాతగా కూడా తన మొదటి సినిమాని ప్రముఖ హీరో అయిన నానితో చేనున్నట్లుగా అంటున్నారు. ఇక ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఆగాలి. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాతో ఎన్టీఆర్ తన అభిమానులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటాడో చూడాలి. ఇక ఈ సినిమా తరువాత ప్రశాంత్ నేను దర్శకత్వంలో మరో సినిమాలో నటించబోతున్నాడు ఎన్టీఆర్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: