శ్రీరెడ్డి శాపం వల్లే ఆ హీరో లైఫ్ నాశనం అయ్యిందా..?

Anilkumar
శ్రీ రెడ్డి. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కుని ఆ కాంట్రవర్సీతో హైలైట్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా సెలబ్రిటీలను తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఓ రేంజ్ లో ఆడేసుకుంటుంది. గతంలో కాస్టింగ్ కౌచ్ అనే వివాదంతో శ్రీరెడ్డి ఎంత పెద్ద రచ్చ చేసిందో అందరికి తెలిసిందే. నిజానికి కాస్టింగ్ కోచ్ వివాదం తర్వాతే శ్రీ రెడ్డి సోషల్ మీడియా అంతటా పాపులర్ అయింది. ఇక సోషల్ మీడియాలో ఈమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ పెడుతూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తుంటుంది. ఇక అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలను  చూపిస్తూ ఓ రేంజ్ లో ఎక్స్పోజింగ్ చేస్తూ సోషల్ మీడియా అంతట హాట్ టాపిక్ అవుతుంది. 

ఇక ఈ మధ్య యూట్యూబ్ లో సొంతంగా ఛానల్ పెట్టి వంట వీడియోలు చేస్తూ పనిలో పనిగా వంటలతో పాటు తన అందాలను సైతం ఓ రేంజ్ లో చూపించింది. దాంతో శ్రీరెడ్డి వంట వీడియోలకు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఇక ఇటీవల హైదరాబాద్ నుంచి చెన్నైకి మకాం మార్చిన శ్రీరెడ్డి ప్రస్తుతం చెన్నైలోనే సెటిల్ అయిపోయింది. ఇదిలా ఉంటే గతంలో దగ్గుబాటి వారసుడు అభిరామ్ తో శ్రీరెడ్డి క్లోజ్ గా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి ఓ రేంజ్ లో హల్చల్ చేసింది. అభిరామ్ ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని, తనను వాడుకొని వదిలేశాడని మీడియా ముందుకు వచ్చి మరి అతని పరువు మొత్తం తీసింది. అయితే చాలా కాలానికి అభిరామ్ ఇండస్ట్రీకి ఇటీవల హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

సీనియర్ దర్శకుడు తేజ దర్శకత్వంలో 'అహింస' అనే సినిమాతో అభిరామ్ హీరోగా పరిచయమయ్యాడు. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ గా నిలిచింది. దీంతో హీరోగా మొదటి సినిమాతో అభిరాంమ్ సక్సెస్ కాలేకపోయాడు. ఈ క్రమంలోనే చాలామంది గతంలో అభిరామ్ చేసిన పనులను గుర్తు చేస్తూ శ్రీరెడ్డి శాపం అభిరామ్ కి గట్టిగా తగిలిందని, చేసిన పాపం ఊరికే పోతుందా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మరోసారి ఇప్పుడు అభిరామ్ ద్వారా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో వార్తల్లోకి ఎక్కింది. మరి దీనిపై శ్రీ రెడ్డి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: