వర్షం మూవీను మిస్ చేసుకున్న స్టార్ హీరో....!!

murali krishna
బాహుబలి సినిమాతో ప్రభాస్ దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన బాహుబలి 2 సినిమా ప్రభాస్ రేంజ్ ను మరింత పెంచింది. ఇక ఆ తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీలే..
పాన్ ఇండియా స్టార్ హీరోగా రాణిస్తున్న హీరోల్లో ముందు వరసలో ఉన్న హీరో ప్రభాస్. ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాతో ప్రభాస్ దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన బాహుబలి 2 సినిమా ప్రభాస్ రేంజ్ ను మరింత పెంచింది. ఇక ఆ తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీలే.. అయితే ప్రభాస్ కు స్టార్ డమ్ తెచ్చిన సినిమా ఏది అంటే టక్కున చెప్పే పేరు వర్షం. ఎంఎస్. రాజు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు శోభన్ దర్శకుడు. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా త్రిష నటించింది. ఇక ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ప్రభాస్- త్రిష కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది..
అయితే ఈ సినిమాలో ప్రభాస్ కు ప్లేస్ లో ముందుగా హీరోగా  మరొకరిని అనుకున్నారట. వర్షం సినిమాలో ముందుగా సూపర్ స్టార్  మహేష్ బాబు ను హీరోగా అనుకున్నారట. దర్శకుడు శోభన్ ఈ సినిమా కథను ముందుగా మహేష్ బాబు కోసం రాసుకున్నారట. అయితే శోభన్ మహేష్ కు కథను వివరించగా ఆయన సున్నితంగా తిరస్కరించారట.
వర్షం కథ విన్న మహేష్. ఈ సినిమా కథకు నేను సెట్ కాను అని రిజక్ట్ చేశారట. దాంతో శోభన్ ఈ సినిమాను ప్రభాస్ తో చేశారట. ప్రభాస్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. అలాగే ఈ సినిమాలో గోపీచంద్ విలన్ గా నటించి మెప్పించారు. ఈ సినిమా తర్వాత గోపీచంద్, ప్రభాస్ మంచి మిత్రులయ్యారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: