పవన్ కళ్యాణ్ 'తీన్ మార్' ప్లాప్ పై స్పందించిన దర్శకుడు.. ఏమన్నాడంటే..?

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రిష జంటగా నటించిన 'తీన్ మార్' మూవీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో భారీ అంచనాలతో థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే ఈ సినిమా ప్లాప్ అవడంపై దాదాపు 12 ఏళ్ల తర్వాత దర్శకుడు జయంత్. సి. పరాన్జీ స్పందించారు. తెలుగులో ప్రేమించుకుందాం రా, బావగారు బాగున్నారా, ప్రేమంటే ఇదేరా వంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ ని తెరకెక్కించిన ఈ దర్శకుడు పవన్ కళ్యాణ్ తో 2011లో తీసిన 'తీన్ మార్' మూవీ ప్లాప్ అవడంతో ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమయ్యాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జయంత్ సి పరాన్జీ తీన్ మార్ సినిమా ప్లాప్ అవడం గురించి స్పందిస్తూ

 పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు జయంత్ మాట్లాడుతూ.. 'తీన్ మార్' మూవీ ప్లాప్ సంగతి పక్కన పెడితే ఈ సినిమా ఇప్పటికీ నాకు ఓ ఫ్రెష్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది. ఈ మూవీ ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ నేను చెప్పలేను. కానీ ఈ మూవీ ప్లాప్ అవడంతో కొంతమంది ఫ్యాన్స్ నిరాశ చెందారు. ముఖ్యంగా ఈ సినిమాలో త్రిష కు సోనూసూద్ తో పెళ్లి చేయడం. ఆ తర్వాత ఆమె మళ్ళీ తిరిగి పవన్ కళ్యాణ్ దగ్గరికి రావడం లాంటి సన్నివేశాలు ప్రేక్షకులకు నచ్చలేదు. కానీ ఇదే మూవీని అప్పుడున్న ఓ యంగ్ హీరోతో చేస్తే దాని రిజల్ట్ వేరేలా ఉండేదేమో' అంటూ చెప్పుకొచ్చారు.

 కాగా తీన్ మార్ సినిమాని బాలీవుడ్ లో సైఫ్ అలీ ఖాన్ హీరోగా నటించిన 'లవ్ ఆజ్ కల్' సినిమాకి రీమేక్ గా తెరకెక్కించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రిష, కృతి కర్బంద కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. అయితే ప్రేక్షకులను సినిమా మెప్పించకపోయినా ఈ సినిమా మాత్రం మ్యూజికల్ హిట్గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాకి మణిశర్మ అందించిన సంగీతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలోని 'గెలుపు తలుపులే' అనే సాంగ్ ని ఇప్పటికీ ఆడియన్స్ వింటుంటారు. పవన్ కళ్యాణ్ తీన్ మార్ సినిమా అంటే ముందుగా ఆడియన్స్ అందరికీ గుర్తొచ్చేది ఈపాటే. ఎందుకంటే ఈ పాట జనాల్లో అంతటి ఆదరణ దక్కించుకుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: