ఆ విషయం లో నేను చాలా నిజాయితీగా ఉంటాను.. అనుపమ పరమేశ్వరన్..!?

Anilkumar
ప్రేమమ్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు తమిళ భాషలతో వరుస సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల నటించిన కార్తికేయ 2 సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోయిన్గా మంచి గుర్తింపును సైతం పొందింది. ప్రస్తుతం కార్తికేయ టు సినిమా తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా భావోద్వేగాలను వ్యక్తపరిచే విషయాలను గురించి కొన్ని సంచల వ్యాఖ్యలను చేసింది అనుపమ పరమేశ్వరన్. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ భావోద్వేగాలను వ్యక్తపరిచే విషయంలో మీరు ఏ విధంగా ఆలోచిస్తారూ.. అనే ప్రశ్న ఆమెకి ఎదురైంది. 

ఇక ఇందుకు సమాధానంగా మాట్లాడుతూ.. తను భావోద్వేగాలను బయటపడే విషయంలో ఎంతో నిజాయితీగా ఉంటానని.. ఒక పని తనకి నచ్చకపోతే నచ్చలేదని సూటిగా చెప్పే మనస్తత్వం నాది అని.. ఆ విషయాన్ని అందరితో నేను మరచిపోతాను అంటూ తెలిపింది. అంతేకాదు ఇలాంటి విషయాల గురించి అసలు ఆలోచించను అని.. వాటి గురించి ఆలోచించి నా సమయాన్ని వృధా చేసుకోను అని.. మన జీవితం అనేది చాలా చిన్నది.. ఈ జీవితంలో మనం ఎన్ని రోజులు ఉంటామో మనకే తెలియదు.. కొద్దిరోజులు ఇక్కడ నివసించి మనకు ఇష్టం వచ్చిన విధంగా నటిస్తూ తిరిగి ఏదో ఒక రోజు వెళ్లిపోయే వాళ్ళం.. 

ఇక్కడి నుండి ఎప్పుడు వెళ్ళిపోతామో కూడా మనకి తెలియదు.. బ్రతికున్న రోజులు ఎంతో మంచిగా ఎలాంటి ఒత్తిడి లేకుండా మంచి జీవితాన్ని గడపాలని..నేను అనుకుంటున్నాను అంటూ వెల్లడించింది అనుపమ పరమేశ్వరన్. సాధారణంగా సీసీటీవీ ఫుటేజ్  నెల రోజుల వ్యవధిలోనే డిలీట్ అయిపోతుంది.అలాగే నా మైండ్ లో ఉన్న చెత్త కూడా ఆటోమేటిగ్గా డిలీట్ అయిపోతూ ఉంటుంది. అంటూ ఈ సందర్భంగా వెల్లడించింది అనుపమ పరమేశ్వరన్.రీసెంట్ గా కార్తికేయ2, 18 పేజేస్ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది.!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: