నాగార్జున కి టబుతో ఉన్న రిలేషన్ బయట పెట్టిన నాగచైతన్య.. !?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కింగ్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నాగార్జున. ఎంతోమంది అమ్మాయిలకి మన్మధుడిగా కలల రాకుమారుడిగా నాగార్జునకి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ఆరుపదుల వయసు దాటినప్పటికీ తన కొడుకుల కంటే ఎక్కువ సినిమాలు చేస్తూ యంగ్గా కనిపిస్తూ దూసుకుపోతున్నాడు నాగార్జున. ఇక ఇలాంటి ఒక స్టార్ హీరోకి మొదటి నుండే చాలా మంది స్టార్ హీరోయిన్లతో లవ్ ఎఫైర్స్ ఉన్నాయంటూ ఎప్పటినుండో వార్తలు వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే అనుష్క, టబు, రమ్యకృష్ణ వంటి హీరోయిన్లతో సీక్రెట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేశాడు నాగార్జున. 

అయితే మరీ ముఖ్యంగా టబుకి నాగార్జునకి మధ్య ఇప్పటికీ కూడా సీక్రెట్ ఉంది అంటూ ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అంతేకాదు టబు ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడానికి గల ముఖ్య కారణం కూడా నాగార్జుననే అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే గతంలోకి ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జున భార్య అమల టబు గురించి మాట్లాడుతూ మా ఆయనకి డబ్బు మంచి స్నేహితురాలు.. నాకు మా ఫ్యామిలీ వాళ్లకు కూడా మంచి ఫ్యామిలీ ఫ్రెండ్.. ఇప్పటికీ హైదరాబాద్ కి వచ్చిన ప్రతిసారి మా ఇంట్లోనే ఉంటుంది..

అంటూ టబు గురించి చెప్పుకొచ్చింది అమల. ఇక అదే విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య సైతం మాట్లాడాడు.. నాన్నకి టబుకి ఉన్న రిలేషన్షిప్ నిజమే.. కానీ అది మీరు అనుకున్నది కాదు.. ఇప్పటికీ టబు గారు మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా పిలవగానే వెంటనే వస్తారు.. ప్రతి పండగకి ఫోన్ చేసి ఇంట్లో వాళ్లందరికీ విషెస్ చెబుతారు... హైదరాబాద్ కి వచ్చిన ప్రతిసారి మా ఇంట్లోనే ఉంటారు... ఆమె మాకు ఒక మంచి ఫ్యామిలీ ఫ్రెండ్. అంటూ టబు నాగార్జునల మధ్య ఉన్న రిలేషన్ షిప్ పై ఓపెన్ అయ్యాడు నాగచైతన్య..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: