సంచలన నిర్ణయం తీసుకున్న శర్వానంద్.. పెళ్ళి తర్వాత వాటికి దూరం కనున్నాడా..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్న శర్వానంద్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మూడుముళ్ల బంధంతో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. హైదరాబాద్కు చెందిన రక్షిత రెడ్డి అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు శర్వానంద్. నిన్న వీరి వివాహానికి సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే ఒకవైపు పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో మరోవైపు పెళ్లిలో గొడవలు జరిగాయని అప్పుడే భార్యకు శర్వానంద్ కొన్ని కండిషన్ కూడా పెట్టాడని దానికి తగ్గట్టుగానే తాను కూడా పెళ్లి తర్వాత కొద్ది రోజులు కొన్ని దూరం కాన్నడంటూ

 సోషల్ మీడియా వేదికగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక అసలు విషయం ఏంటంటే హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కూతురు రక్షిత రెడ్డిని వివాహం చేసుకున్నాడు శర్వానంద్. అయితే అలా పెళ్లి జరిగిందో లేదో ఇలా భార్యకు కండిషన్స్ పెట్టాడట శర్వానంద్. ఇక అదేంటంటే ఆమెకు ఫోటోలకు ఫోజులు ఇవ్వలో తెలియదట ఎక్స్ప్రెషన్స్ ఎలా పెట్టాలి అన్న విషయం కూడా తన భార్యకి తెలియదట. దాంతో ఫోటోలకి ఫోజులు ఎలా ఇవ్వాలి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలి అని అప్పుడే భార్యకు నేర్పించాడట శర్వానంద్. అంతేకాదు తన భార్య మీద ఉన్న ప్రేమతో ఓవర్గా కేర్ తీసుకుంటున్నాడు అంటూ కళ్యాణ మండపంలో

 శర్వానంద్ బిహేవ్ చేసిన పద్ధతి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది .అంతేకాదు ఈ క్రమంలోని శర్వానంద్ పెళ్లికి వచ్చిన తన స్నేహితులు కొంతమంది పెళ్ళిలో తాగి గొడవ కూడా చేశారని కానీ ఫైనల్ గా ఎట్టకేలకు అంతా కూల్ గా సర్దమగింది అని ఎటువంటి ఆటంకాలు లేకుండా పెళ్లి మొత్తం పూర్తయింది అన్న వార్తలు వినబడుతున్నాయి. ఈ క్రమంలోనే తన భార్యపై ఆయనకున్న ప్రేమతో కొన్ని రోజులు అన్ని సినిమా షూటింగ్లకి బ్రేక్ ఇచ్చి తన భార్యతో సమ్మర్ వెకేషన్ ప్లా న్ చేశాడట శర్వానంద్. కొన్ని నెలలు తన భార్యతో సంతోషంగా ఏకాంతంగా గడిపిన తర్వాత మళ్లీ తన సినిమా పనిలో బిజీ కావాలనుకుంటున్నాడట శర్వానంద్. దీంతో శర్వానంద్ కి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: