సెకండ్ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న ఆదిపురుష్ ఫ్యాన్స్..!!

murali krishna
ప్రభాస్, కృతి సనన్ హీరో హీరోయిన్ లుగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్సినిమా ''ఆదిపురుష్'' . ఈ పీరియాడిక్ వండర్ కోసం ఆడియెన్స్ ఎంత గానో ఎదురు చూస్తున్న సమయం లో మరొక పది రోజుల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది.అందుకే మరింత గా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాపై ఒక్కసారిగా హైప్ రావడానికి కారణం ట్రైలర్ అనే చెప్పవచ్చు.
ఈ తర్వాత తర్వాత నుండి ఈ సినిమా నుండి ఏ అప్డేట్ వచ్చిన కూడా ఆకట్టు కుంటుంది.. వరుసగా అప్డేట్ లను ఇస్తూ మేకర్స్ కాస్త పాజిటివ్ వైబ్స్ అయితే క్రియేట్ చేయడం లో సఫలం అయ్యారని తెలుస్తుంది.. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన రెండు సాంగ్స్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి. ఈ సాంగ్స్ వల్లనే ఆదిపురుష్ సినిమా కు ఇంకా హైప్ పెరిగింది అనే చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి మరో ట్రైలర్ ఉందని ఎప్పటి నుండో టాక్ వస్తున్న ఇప్పుడు ఈ రెండవ ట్రైలర్  గురించి కూడా అప్డేట్ వస్తుంది.. మరి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రెండవ ట్రైలర్ ఫుల్ లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నారని తెలుస్తుంది.ఈ ట్రైలర్ అయితే ఈసారి నెక్స్ట్ లెవల్ యాక్షన్ మోడ్ లో ఉంటుంది అని సమాచారం.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా జూన్ 6న తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోనుందని తెలుస్తుంది.. మరి ఆ ఈవెంట్ లోనే సెకండ్ ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు అని సమాచారం... భారీ అభిమానుల మధ్య ఈ ట్రైలర్ ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని ఈ ట్రైలర్ 30 సెకన్ల నిడివితో ఉంటుందని ఫస్ట్ ట్రైలర్ కంటే మరింత ఎక్కువ హైప్ తెచ్చేలా కట్ చేసారని కూడా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: