పక్కా ప్లాన్ తో ఎన్టీఆర్ సినిమా షూట్ పూర్తి చేస్తున్న కొరటాల..!!

murali krishna
పాన్ ఇండియన్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ''దేవర''..ఈ సినిమాకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే రోజే టైటిల్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. ''దేవర'' అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేయగా ఈ సినిమాపై మరింత హైప్ నెలకొందని తెలుస్తుంది... మంచి పవర్ ఫుల్ స్టోరీతోనే ఎన్టీఆర్ తో కొరటాల సినిమా తెరకెక్కిస్తున్నాడు అని సమాచారం.
ఇది పాన్ ఇండియన్ సినిమా కావడంతో కొరటాల అన్ని ఇండస్ట్రీలోని నటీ నటులను ఎంపిక చేస్తూ ముందుకు వెళుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ అవ్వగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించనున్నారు. ఈ ఇద్దరు ఈ సినిమాలో భాగం కావడంతో ఈ సినిమాపై బాలీవుడ్ లో కూడా ఆసక్తి నెలకొందని తెలుస్తుంది..
ఇక తాజాగా ఎన్టీఆర్ తన వెకేషన్ ముగించుకుని హైదరాబాద్ చేరుకోవడంతో కొరటాల మరో షెడ్యూల్ ప్లాన్ చేసాడని సమాచారం.. ఈ సినిమాలో తారక్ అతి త్వరలోనే జాయిన్ కానున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసిన ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ పై అప్డేట్ బయటకు వచ్చింది. నెక్స్ట్ షెడ్యూల్ కోసం కొరటాల ఎగ్జైటింగ్ గా ప్లాన్ చేసాడని తెలుస్తుంది..
ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ తో పాటు సైఫ్ అలీ ఖాన్ అలాగే యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ పై ఇంట్రెస్టింగ్ సీన్స్ షూట్ చేయనున్నట్టు తెలుస్తుంది.. మరి ఈ కీలక సన్నివేశాల కోసం ఎన్ని రోజుల షెడ్యూల్ ప్లాన్ చేసారో  మాత్రం తెలియదు కానీ ఇప్పుడు ఈ షెడ్యూల్ పై ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కూడా ఈ ఏడాది ఎండింగ్ లోపే ఈ సినిమా షూట్ మొత్తం కంప్లీట్ అయ్యేలా పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకున్నట్టు సమాచారం.ఈ సినిమా ను వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: