"ఆది పురుష్" డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా ఆది పురుష్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటించగా ... బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ షూటింగ్ ముగిసి ఇప్పటికే చాలా కాలం అవుతున్న ఈ మూవీ కి అత్యధిక గ్రాఫిక్స్ పనులు ఉండడంతో చాలా రోజుల పాటు ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క గ్రాఫిక్స్ అద్భుతంగా రావడం కోసం పోస్ట్ ప్రొడక్షన్ పనులను చాలా రోజుల పాటు చేశారు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాను జూన్ 16 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ ,  కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ లో బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఇప్పటికే ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ఒక సంస్థ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకున్నట్లు ... అందులో భాగంగా ఈ మూవీ యొక్క థియేటర్ రన్ కొన్ని వారాలు ముగిసిన తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: