మాళవిక మెరుపులు.. అందంతో లాగేస్తుంది..!

shami
మలయాళ భామలకు ఇప్పుడు సౌత్ సినీ పరిశ్రమలో మంచి డిమాండ్ ఏర్పడింది. అందానికి అందం నటనకు నటన తో వారు ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నారు. ఇక వారిలో మాస్టర్ బ్యూటీ మాళవిక తన మెరుపులతో ఆడియన్స్ ని అలరిస్తుంది. తమిళం లో సినిమాలు చేస్తున్న అమ్మడు తెలుగులో ప్రభాస్ సినిమాతో ఎంట్రీ ఇస్తుంది. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో వస్తున్న రాజా డీలక్స్ సినిమాలో మాళవిక నటిస్తుంది. అమ్మడు చేస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తో అమ్మడు టాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది.
సినిమాల తోనే కాదు ఫోటో షూట్స్ తో అమ్మడు సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది. లేటెస్ట్ గా అమ్మడు తన క్యాజువల్ లుక్ లో మాళవిక మస్త్ జబర్దస్త్ గా ఉంది. తన ఓర చూపులతో ఆడియన్స్ హృదయాల్లో గిలిగింతలు పెడుతుంది అమ్మడు. మాళవిక సోషల్ మెరుపుల కు ఆమె ఫాలోవర్స్ ఫిదా అవుతున్నారు. ఆమె ఫోటో షూట్స్ కింద కామెంట్స్ చూస్తే అమ్మడు ఫాలోవర్స్ ని ఎంతగా డిస్టర్బ్ చేస్తుందో అర్ధమవుతుంది.
సినిమాలతోనే కాదు ఫోటో షూట్స్ తో ఆడియన్స్ ని అలరించడం లో ఈమధ్య హీరోయిన్స్ పీక్స్ లో ఉన్నారు. వీరికి ఈ ఫోటో షూట్స్ వల్ల మంచి మైలేజ్ వచ్చేలా చేస్తుంది. ఇప్పుడే మాళవిక జోరు ఇలా ఉంది అంటే ఇక ప్రభాస్ సినిమా రిలీజ్ అయ్యాక మరింత తెచ్చిపోయే అవకాశం ఉంది. తెలుగులో అమ్మడు చేస్తున్న సినిమా ఒక్కటే అయినా తన గురించి టాలీవుడ్ లో హాట్ డిస్కషన్ జరుగుతుంది. ఇక ప్రభాస్ సినిమా హిట్ పడితే మాత్రం అమ్మడి రేంజ్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు. ప్రభాస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతున్న మాళవిక తప్పకుండా తెలుగులో టాప్ రేంజ్ కి వెళ్తుందని అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: