ప్రభాస్ బ్లాక్ బస్టర్ వర్షం సినిమా రిజెక్ట్ చేసిన స్టార్ హీరో..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కెరియర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో వర్షం సినిమా కూడా ఒకటి. శోభన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. కాగా టాలీవుడ్ మ్యాచ్ హీరో గోపీచంద్ ఈ సినిమాలో నటించారు. ఆయనతో పాటుగా ప్రకాష్ రాజ్, సునీల్, రఘుబాబు తదితరులు కీలక పాత్రలో నటించారు. ఎమ్మెస్ రాజు నిర్మించిన ఈ సినిమా 2004లో విడుదలై  ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఇక ప్రభాస్ కెరియర్ లో వచ్చిన మూడవ సినిమా ఇది. దాంతోపాటు ప్రభాస్  కెరియర్లో హిట్గా నిలిచిన మొదటి సినిమా కూడా ఇదే. 

ఇక ఈశ్వర్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ రాఘవేంద్ర సినిమాతో నిరాశపర్చాడు. అనంతరం మూడవ సినిమాతో తన సత్తా ఏంటో నిరూపించాడు . వర్షం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని కలెక్షన్ ను రాబట్టింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ త్రిష కెమిస్ట్రీ ప్రేక్షకులకు ఎంత నచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతేకాదు హీరో హీరోయిన్ ఏ రేంజ్ లో ఆకట్టుకున్నారో విలన్ పాత్రలో నటించిన గోపీచంద్ సైతం అంతే ఆదరణను పొందాడు. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ని అందించాడు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి మరింత ప్లస్ అయింది అని చెప్పాలి.

అయితే తాజాగా ప్రభాస్ నటించిన వర్షం సినిమాకి సంబంధించిన సోషల్ మీడియా వేదికగా ఒక వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం ఏంటంటే.. చాలామందికి తెలియని విషయం ఏంటంటే వర్షం సినిమాకి ఫస్ట్ ఛాయిస్ ప్రభాస్ కాదు. మొదట ఈ సినిమా డైరెక్టర్ శోభన్ ఈ సినిమా కథను టాలీవుడ్ కి చెందిన ఒక స్టార్ హీరో కోసం అనుకున్నారట .కానీ ఆ స్టార్ హీరో ఈ సినిమాని ముందుగా రిజెక్ట్ చేశాడు. అయితే ప్రభాస్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ సినిమాను రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు. వర్షం సినిమాలో ముందుగా మహేష్ బాబుతో తీయాలని అనుకున్నాడట డైరెక్టర్ శోభన్. కానీ ఈ స్టోరీ తనకి సెట్ అవ్వదు అని ఈ సినిమాని రిజెక్ట్ చేశారట సూపర్ స్టార్ మహేష్ బాబు. దాని తర్వాత ఈ సినిమా కథ అతను ప్రభాస్ కి వినిపించడంతో కథ నచ్చిన ప్రభాస్ ఒకే చేసాడట..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: