పెళ్లి వార్తలపై ఘాటుగా స్పందించిన కీర్తి సురేష్..?

Anilkumar
టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో 'నేను శైలజ' అనే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ ఆ తర్వాత 'మహానటి' సినిమాతో ఏకంగా స్టార్ హీరోయిన్గా మారిపోయింది. మహానటి సినిమాలో అద్భుతమైన నటన కనబరిచి తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయింది. ఇక మహానటి తర్వాత అగ్ర హీరోల సినిమాల్లో నటించి పలు హిట్స్ అందుకుంది. ప్రస్తుతం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ ముందుకెళ్తోంది కీర్తి సురేష్. రీసెంట్ గా 'దసరా' మూవీ తో పాన్ ఇండియా హిట్ తన ఖాతాలో వేసుకుంది. గత కొంతకాలంగా వరుస ప్లాప్ తో ఇబ్బంది పడుతున్న కీర్తి సురేష్ కి దసరా మూవీ సక్సెస్ ఆమెలో సరికొత్త ఉత్సాహం నింపింది. దసరా సినిమాలో వెన్నెల పాత్రలో మరోసారి తన నటనతో కట్టిపడేసింది కీర్తి సురేష్.

ఇక దసరా సక్సెస్ తో ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'బోలాశంకర్' సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలిగా కనిపించనుంది. షూటింగ్ తుది దశకు చేరుకున్న ఈ సినిమా ఆగస్టు 11 విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాతో పాటు తమిళంలో ఇప్పటికే నాలుగు సినిమాలకు సైన్ చేసి వాటి షూటింగ్స్ తో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే కీర్తి సురేష్ కుటుంబ సభ్యులు ఆమె పెళ్లిపై క్లారిటీ ఇవ్వడం జరిగింది.

అయినా కూడా ఆ వార్తలు ఆగకపోవడంతో తాజాగా ఓ ఆడియో ఫంక్షన్ లో కీర్తి సురేష్ తన పెళ్లిపై స్వయంగా స్పందించింది. ఈ మేరకు ఆడియో ఫంక్షన్ లో కీర్తి సురేష్ మాట్లాడుతూ.. " నా పెళ్ళికి సంబంధించి వస్తున్న వార్తలపై ఇప్పటికే నేను క్లారిటీ ఇచ్చాను అయినా ఇంకా ఎందుకు అడుగుతున్నారు? నా పెళ్లి పై మీకెందుకు అంత ఇంట్రెస్ట్? నా పెళ్లి ఫిక్స్ అయితే స్వయంగా నేనే ప్రకటిస్తా. దీని గురించి ప్రతిసారి ప్రెస్ మీట్ లో అడగాల్సిన అవసరం లేదు' అంటూ తన పెళ్లి వార్తలపై కీర్తి సురేష్ కాస్త ఘాటుగానే స్పందించింది. దీంతో తాజాగా తన పెళ్లి పై కీర్తి సురేష్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం తమిళంలో కీర్తి సురేష్ మామన్నాన్, సైరన్, రివాల్వర్ రీటా, రఘు తథా వంటి సినిమాలతో బిజీగా ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: