వరుస అప్డేట్స్ తో ఫ్యాన్స్ లో జోష్ నింపిన కార్తీ..!!

Anilkumar
కోలీవుడ్ హీరో కార్తీ తాజాగా తన ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్స్ ఇచ్చాడు. ఒకేసారి ఏకంగా తన మూడు సినిమాల అప్డేట్స్ ని ఇవ్వడంతో ఫాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం కార్తి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జపాన్'. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కార్తీ సరసన అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. రాజమురుగన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవల కార్తి బర్త్ డే సందర్భంగా సినిమా నుంచి టీజర్ విడుదలై ఆకట్టుకున్న్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాతో పాటే కార్తీ తన 26 సినిమా షూటింగ్ లోనూ పాల్గొంటున్నాడట. చెన్నైలో ఈరోజు ఉదయం జపాన్ మూవీ ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ అయింది.

ఇక జపాన్ తర్వాత కార్తి నటిస్తున్న 26వ మూవీ ఇటీవలే షూటింగ్ మొదలవగా ఈ ఏడాది చివరికల్లా ఈ సినిమా కూడా చిత్రీకరణ పూర్తి చేసుకోనుంది. ఇక మరోవైపు కార్తీ 27 కి సంబంధించి మరో ఎగ్జైటింగ్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. లేటెస్ట్ కోలీవుడ్ మీడియా టాక్ ప్రకారం కార్తీ 27 లో హాలీవుడ్ అగ్ర నటుడు అరవింద్ స్వామి ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. అయితే అతడు పోషించే పాత్ర ఏంటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంచారు. కార్తీ 26వ ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తి అయిన వెంటనే కార్తీక్ 27వ సినిమా మొదలుకానుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని కార్తీ సోదరుడు తమిళ హీరో సూర్య తన సొంత బ్యానర్ 2D ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మించబోతున్నాడట.

విజయ్ సేతుపతి - త్రిష కాంబినేషన్లో రూపొందిన 96 మూవీ ని డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ కార్తి 27వ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలను రానున్న రోజుల్లో స్వయంగా కార్తి వెల్లడించనున్నాడు. ఇక కార్తీ మూడు సినిమాలకు సంబంధించి ఒకేసారి అప్డేట్స్ రావడంతో ఫాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక కార్తీ ప్రెజెంట్ నటిస్తున్న 'జపాన్' విషయానికొస్తే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాని దీపావళి కానుకగా థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో సునీల్ విజయ్ మిల్టన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: