నాని సరసన సాహూ బ్యూటీ..?

Anilkumar
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ టాలీవుడ్ లో ప్రభాస్ కి జోడిగా 'సాహో' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాన్ని అందుకుంది. ఇక సాహో రిజల్ట్ తర్వాత సైలెంట్ అయిపోయిన ఈ బ్యూటీ మళ్ళీ తెలుగులో మరో సినిమా చేయలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లోనే పలు సినిమాలతో బిజీగా ఉంది. అయితే తాజాగా ఓ టాలీవుడ్ హీరో తో జోడి కట్టేందుకు శ్రద్ధా కపూర్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు మన న్యాచురల్ స్టార్ నాని. శ్రద్ధా కపూర్ తాజాగా నాని సరసన నటిస్తుందట. అయితే అది సినిమాలో మాత్రం కాదట. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. 

నాని, శ్రద్ధా కపూర్ కలిసి ఓ యాడ్ లో నటిస్తున్నట్లు సమాచారం. ఓ ప్రముఖ బ్రాండ్ కి సంబంధించిన యాడ్లో శ్రద్ధా కపూర్, నాని జంటగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ యాడ్ ని హిందీ తో పాటు తెలుగులో కూడా ప్లాన్ చేయగా.. హిందీలో బాలీవుడ్ హీరో తో తెలుగులో మాత్రం నాచురల్ స్టార్ నానితో ఈ యాడ్ ని మేకర్స్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ రెండిట్లో శ్రద్ధా కపూర్ మాత్రం కామన్ గా ఉంటుందట. శ్రద్ధా కపూర్ తో నాని ఓ యాడ్ చేస్తున్నాడు అనే విషయం తెలిసి నాని ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇప్పటికే నాని రెండు కమర్షియల్ యాడ్స్ లో కనిపించిన విషయం తెలిసిందే.

ఇటీవల 'దసరా' సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న నాని ఇప్పుడు యాడ్స్ లోనూ కనిపించి ఫ్యాన్స్ ని అలరించేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి అగ్ర హీరోలు వరుస యాడ్స్ చేస్తూ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మెల్ల మెల్లగా ఆ లిస్టులో నాని కూడా చేరిపోయాడు. ఇక దసరా సక్సెస్ తర్వాత నాని తన 30వ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో నాని సరసన సీతారామం బ్యూటీ మృనాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటిస్తోంది. తండ్రి కూతుర్ల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని ఓ నూతన దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే సగానికి పైగా ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా మూవీ టీం ముంబై షెడ్యూల్ ని ముగించుకొని లేటెస్ట్ షెడ్యూల్ కి రెడీ అవుతుంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాది చివరికల్లా సినిమాని విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: