అఖిల్ నెక్స్ట్ మూవీ ఆ జోనర్లో..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ప్రేమికులకు అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందినటు వంటి అఖిల్ మూవీ తో హీరో గా వెండి తెరకు పరిచయం అయ్యాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. ఆ తరువాత వరుసగా హలో , మిస్టర్ మజ్ను సినిమాలతో కూడా ఈ హీరో అపజయాలను అందుకున్నాడు. ఆ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందినటువంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ మూవీ లో ఈ యువ నటుడు హీరోగా నటించాడు.

ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ మూవీ లో పూజా హెగ్డే ... అఖిల్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో కెరీర్ లో హీరోగా మొదటి విజయాన్ని అందుకున్న అఖిల్ ఆ తర్వాత స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందినటువంటి ఏజెంట్ అనే స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో సాక్షా వైద్య హీరోయిన్ గా నటించగా ... ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించాడు.

మలయాళ నటుడు మమ్ముట్టి ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే ఏజెంట్ మూవీ తో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న అఖిల్ తన తదుపరి మూవీ పై ప్రస్తుతం ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే అందులో భాగంగా ఒక కథను ఇప్పటికే ఓకే చేసినట్లు తెలుస్తోంది. అఖిల్ ఇప్పటికే ఒక ఫాంటసీ డ్రామా కథను ఒక్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే వెలబడబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: