మళ్లీ అలరించడానికి వస్తున్న సూర్య బాయ్..!!

Divya
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ పూరీ కాంబినేషన్లో సినిమా విడుదలవుతున్నాయి అంటే చాలు ఆ సినిమాపై భారీగా అంచనాలు మొదలవుతుంటాయి..అలా ఇప్పటివరకు పోకిరి, బిజినెస్ మ్యాన్ వంటి చిత్రాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా రీ రిలీజ్ హవా నడుస్తోంది.. మొదట ఈ శ్రీ కారానికి పోకిరి సినిమాతోనే మొదలుపెట్టారు మహేష్ బాబు. ఆ తర్వాత ఎంతోమంది హీరోలు ఇలా రీ రిలీజ్ సినిమాలు అయ్యి కలెక్షన్ల పరంగా కూడా పరవాలేదు అనిపించుకున్నారు.

ఇప్పుడు మరొకసారి మహేష్ బాబు నటించిన బిజినెస్ మాన్ చిత్రం రీ రిలీజ్కు సిద్ధమవుతోంది. ఈ విషయం తెలిసి మహేష్ అభిమానులు కాస్త ఆనందాన్ని తెలియజేస్తున్నారు. బిజినెస్ మాన్ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా 2012 జనవరి 13న విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.ఈ చిత్రంలో మహేష్ నెగటివ్ పాత్రలో చాలా డిఫరెంట్ క్యారెక్టర్లు నటించారని చెప్పవచ్చు. అందుకే ఈ సినిమా మహేష్ బాబు ఫ్యాన్స్ కి ప్రేక్షకులకు సైతం బాగా కనెక్ట్ అయ్యింది. ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను కూడా బద్దలు కొట్టినట్లు సమాచారం.
ఈ చిత్రం వచ్చి పదేళ్లు అవుతున్న ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పవచ్చు.. ముఖ్యంగా ఈ సినిమాలోని డైలాగ్స్ కూడా సోషల్ మీడియాలో మిమ్స్ రూపంలో  కనిపిస్తూనే ఉంటాయి. ఈ చిత్రాన్ని మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9వ తేదీన విడుదల చేయడానికి చిత్ర బృందం పలు సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు సైతం సూర్యా భాయ్ మళ్లీ థియేటర్లోకి ఎంట్రీ అవుతున్నాడంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం త్రివిక్రమ్ తో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా తర్వాత రాజమౌళితో సినిమా చేయాల్సి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: