10శాతం షూటింగ్ తో భారీ స్థాయి బిజినెస్ !

Seetha Sailaja
టాప్ హీరోల అభిమానులు తమ హీరోలను తమకు నచ్చేపాత్రలో చూపించాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి సినిమాలు మాత్రమే బ్లాక్ బష్టర్ హిట్ అవుతాయి. పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల వైపు యూటర్న్ తీసుకున్న తరువాత కొన్ని సినిమాలలో నటించినప్పటికీ ఆసినిమాలు పవన్ అభిమానులను పూర్తిగా సంతృప్తి పరచకపోవడంతో ఒక మోస్తరు విజయాలు మాత్రమే సాధించాయి.

పవర్ స్టార్ అభిమానులు పవన్ నుండి ‘గబ్బర్ సింగ్’ లాంటి ఒక మాస్ సినిమాను కోరుకుంటున్నారు. ఈనేపధ్యంలో పవన్ హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో ప్రారంభం అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై పవన్ అభిమానులు చాల ఆశలు పెట్టుకున్నారు. వాస్తవానికి ఈసినిమా షూటింగ్ కేవలం 10శాతం మాత్రమే పూర్తి అయింది అన్నవార్తలు ఉన్నాయి.  

ఈసినిమాకు సంబంధించి లేటెస్ట్ గా విడుదలైన ఈమూవీ ఫస్ట్ గ్లింప్స్ కు వచ్చిన స్పందన ఆకాశానికి తాకింది. హరీష్ శంకర్ ఒక వీరాభిమానిగా పవన్ నుంచి అభిమానులు ఏం కోరుకుంటారో అతడికి బాగా తెలుసనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఫ్యాన్స్ కోరుకున్నట్లుగా మాస్‌ గా స్టైలిష్‌ గా పవన్‌ ను ప్రెజెంట్ చేసిన తీరు చూసి ఈమూవీ పై విపరీతంగా క్రేజ్ ఏర్పడటంతో ఈమూవీ షూటింగ్ సగం కూడ పూర్తికాకుండానే బయ్యర్ల నుండి ఈమూవీ నిర్మాతలకు చాల భారీ ఆఫర్స్ వస్తున్నట్లు టాక్. ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ కూడా ఇలాంటి ఆనందంలోనే ఉన్నారు.

మహేష్ చాలాకాలంగా క్లాస్ టచ్ ఉన్న సినిమాలలో మాత్రమే నటిస్తున్నాడు. క్రితం సంవత్సరం ‘సర్కారు వారి పాట’ అంటూ మాస్ మూవీ చేసినప్పటికీ అతడి అభిమానులకు అది నచ్చలేదు. ఇలాంటి పరిస్థితులలో త్రివిక్రమ్ లాంటి క్లాస్ డైరెక్టర్ మహే‌ష్‌ను ‘గుంటూరు కారం’లో మాస్‌గా ప్రెజెంట్ చేయడం మహేష్ అభిమానులకు విపరీతంగా నచ్చడంతో ఈమూవీ ఫస్ట్ లుక్ టీజర్ విడుదలైన కొద్ది గంటలకే వైరల్ గా మారింది. ఏఇనిమా షూటింగ్ కూడ కేవలం 10 శాతం మాత్రమే పూర్తి అయింది అని అంటారు. అయినప్పటికీ ఈమూవీ బయ్యర్ల నుండి భారీ ఆఫర్స్ వస్తున్నాయన్న ఆఫర్లు వస్తున్నాయన్న వార్తలు వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: