ఏజెంట్ డైరెక్టర్ కి బడా ప్రొడ్యూసర్ ఛాన్స్..?

Anilkumar
టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో స్టైలిష్ డైరెక్టర్గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు సురేందర్ రెడ్డి. 'అతనొక్కడే' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సురేందర్ రెడ్డి తనదైన స్టైల్ ఆఫ్ మేకింగ్ తో సినిమాలను తెరకెక్కిస్తూ పలు హిట్స్ ని అందుకున్నాడు. 'ధ్రువ' లాంటి సక్సెస్ తర్వాత సుమారు మూడేళ్లు గ్యాప్ తీసుకున్న సురేందర్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవితో సైరా నరసింహారెడ్డి లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాతో వచ్చాడు. అయితే బడ్జెట్ ఎక్కువవ్వడం వల్ల ఈ సినిమా అనుకున్న స్థాయిలో కమర్షియల్ గా సక్సెస్ కాలేక పోయింది. 

కానీ ఈ సినిమాలో సురేందర్ రెడ్డి మేకింగ్ స్టైల్ ప్రేక్షకుని ఆకట్టుకుంది. ఇక రీసెంట్ గా ఈ దర్శకుడు తెరకెక్కించిన 'ఏజెంట్' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచి బాగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. నిజానికి సురేందర్ రెడ్డి తో అఖిల్ సినిమా చేస్తున్నాడు అనగానే ఈ యంగ్ హీరో జాక్ పాట్ కొట్టేసాడని, ఈ దెబ్బతో అఖిల్ కెరియర్ టర్న్ అయిపోతుందని, అఖిల్ స్టార్ రేంజ్ కి వెళ్ళిపోతాడు అంటూ అందరూ అనుకున్నారు. కట్ చేస్తే అఖిల్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఏజెంట్ మిగిలిపోయింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అక్కినేని ఫ్యాన్స్ ని బాగా డిసప్పాయింట్ చేసింది. అంతేకాదు ఈ సినిమా ఫెయిల్యూర్ బాధ్యత అంతా సురేందర్ రెడ్డిదే అనే మాటలు సైతం ఇండస్ట్రీలో బాగా వినిపించాయి. ఇక ఏజెంట్ రిలీజ్ తర్వాత సురేందర్ రెడ్డి కూడా ఎక్కడా బయట కనిపించలేదు.

దీంతో ఇక సురేందర్ రెడ్డికి మళ్ళీ అవకాశాలు రావడం కష్టమేనని, ఒకవేళ వచ్చినా దానికి చాలా సమయం పడుతుందని అనుకుంటున్న సమయంలో ఓ బడా ప్రొడ్యూసర్ సురేందర్ రెడ్డి కి అదిరిపోయే ఆఫర్ ఇచ్చాడు. నిజానికి ఈ ఆఫర్ పాతదే.ఇంతకీ అసలు విషయం ఏంటంటే సురేందర్ రెడ్డి రాంచరణ్ తో ధ్రువ సినిమా చేస్తున్న సమయంలోనే గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ తో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. ఆ సమయంలో ఆయన దగ్గర స్టోరీ కూడా లేదు. కేవలం మాటమీద అల్లు అరవింద్ సురేందర్ రెడ్డికి అడ్వాన్స్ కూడా ఇచ్చేశాడు. ఇక ఇప్పుడు ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుందని సమాచారం. అయితే అది ధ్రువ సీక్వెల్ అయితే కాదని అంటున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లోనే వేరే హీరోతో గీతా ఆర్ట్స్ ఓ మూవీ ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే మేకర్స్ కొంతమంది హీరోలను కలుస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతోందట. ఏదేమైనా ఏజెంట్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత సురేందర్ రెడ్డి కి ఇంత త్వరగా మరో మూవీ ఆఫర్ రావడం నిజంగా విశేషమనే చెప్పాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: