పెళ్లికి ముందే ఆ పని చేస్తే తప్పేముంది.. శృతిహాసన్..!?

Anilkumar
ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు పెళ్లి అయిన తర్వాత మాత్రమే పిల్లల్ని కనేవారు. కానీ ఇప్పుడు పెళ్లికి ముందే డేటింగ్ పేరుతో దారుణాలను చూడాల్సిన వస్తుంది. పెళ్లికి ముందే పిల్లల్ని కంటున్నారు. కనీసం వారి పిల్లలకి తండ్రి ఎవరు అన్న విషయాన్ని కూడా బయట పెట్టడం లేదు చాలామంది .ఒకప్పుడు ఇతర దేశాలలో ఇలాంటివి ఎక్కువగా చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు మన దేశంలో కూడా ఇలాంటివి రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇటీవల ఆలియా భట్ కూడా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అమీ జాక్సన్ కూడా పెళ్లికి ముందే ఒక కొడుకుకి జన్మనిచ్చింది.

తాజాగా ఇప్పుడు గోవా బ్యూటీ ఇలియానా సైతం పెళ్లికి ముందే గర్భవతి అంటూ అందరికీ షాక్ ఇచ్చింది. అంతేకాదు ఇప్పటివరకు తన బిడ్డకు తండ్రి ఎవరు అన్న విషయాన్ని మాత్రం ఇంకా రివిల్ చేయలేదు. ఇక ఇలాంటి సంఘటనలు రోజురోజుకీ ఎక్కువ అవ్వడంతో ఈ విషయాలపై స్పందించింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్. ఈ విషయంపై షాకింగ్ కామెంట్లు చేసింది. అయితే ఇప్పటివరకు శృతిహాసన్ చాలామందితో డేటింగ్ చేసింది. తాజాగా ఇప్పుడు శాంతను హాజరికతో మీటింగ్లో ఉంది శృతిహాసన్. అంతేకాదు ప్రస్తుతం వారిద్దరూ ముంబైలో ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఇందులో భాగంగానే ఆమెకి ఒక ప్రశ్న ఎదురయింది. పెళ్లికి ముందు పిల్లల్ని కనడాన్ని మీరు ఎలా చూస్తారు అని అడిగింది యాంకర్.. ఇందుకు శృతిహాసన్ స్పందిస్తూ.. ఇందులో తప్పేముంది.. పిల్లల్ని కనే హక్కు ఆడవారికి మాత్రమే ఉంది.. కాబట్టి ఎప్పుడు కనాలి అనేది వారి నిర్ణయం.. నేను దాన్ని గౌరవిస్తాను.. ఆడవారి స్వేచ్ఛకు సమాజం గౌరవం ఇవ్వాలి.. దాని అవసరం ఎంతైనా ఉంది ..అంటూ షాకింగ్ కామెంట్స్  చేసింది శృతిహాసన్. దీంతో పెళ్లికి ముందు పిల్లల్ని కన్నడంపై శృతిహాసన్ చేసిన కామెంట్స్ కాస్త  సోషల్ మీడియా వేదికగా వేలవుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఆమె కూడా పెళ్లికి ముందే పిల్లల్ని కనెక్టుగానే కనిపిస్తుంది అంటూ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: