ఏంటి.. రమ్యకృష్ణ అలాంటి పనులు కూడా చేస్తుందా..!?

Anilkumar
ఒకప్పటి టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపేసింది రమ్యకృష్ణ.కానీ ఇప్పటికీ అదే క్రేజ్ తో సినిమాల్లో నటిస్తోంది. ఇంత వయస్సు పెరిగిన అందం మాత్రం తరగకుండా ఎటువంటి రూమర్స్ లేకుండా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతోంది రమ్యకృష్ణ.కానీ తాజాగా ఇప్పుడు రమ్యకృష్ణ కి సంబంధించిన ఒక వార్తా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ఇప్పటివరకు ఏ హీరోయిన్ కి లేని ఒక టాలెంట్ ఈ హీరోయిన్ కి ఉందట. ఇన్నాళ్లకు ఆ టాలెంట్ బయటపడడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతున్నారు. 

ఎన్నో సినిమాలు చేసి అవార్డులో రివార్డులను కూడా దక్కించుకున్న రమ్యకృష్ణ చాలా సినిమాల్లో హీరోయిన్లకి డబ్బింగ్ కూడా చెప్పిందని అంటున్నారు. ఇక ఆమె భర్త ఒక ప్రముఖ డైరెక్టర్ అని చాలామందికి తెలిసే ఉంటుంది. డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమాని టీవీలో వేస్తే ఖచ్చితంగా టీవీలకు అతుక్కుపోతుంటారు సినీ అభిమానులు. అయితే ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే హీరో శ్రీకాంత్ ప్రేయసి సోనాలి బింద్రే డబ్బింగ్ చెప్పిందిట రమ్యకృష్ణ. అయితే ఇప్పటివరకు రమ్యకృష్ణ చాలా సినిమాల్లో నటించింది.
అయినప్పటికీ రమ్యకృష్ణకు తన సినిమాలో తానే డబ్బింగ్ చెప్పుకునే అలవాటు కూడా లేదట. 

ఇక అలాంటి ఒక స్టార్ హీరోయిన్ తో డబ్బింగ్ కూడా చెప్పించారట కృష్ణవంశీ. దీంతో రమ్యకృష్ణ కి ఉన్న ఈ టాలెంట్ చూసి ఆమె ఫ్యాన్స్ షాక్ అవ్వుతున్నారు. ఇక ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా సినిమాల్లో నటించిన రమ్యకృష్ణ ఇప్పుడు ఏజ్ కి తగ్గ పాత్రలు చేస్తూ బిజీగా ఉంది .దీంతో రమ్యకృష్ణ కి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పటివరకు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.ఇక ఇటీవల 'రంగమార్తాండ' సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన రమ్యకృష్ణ ప్రస్తుతం రజనీకాంత్ 'జైలర్' సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: