ఏకంగా ఆ సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసిన రష్మీక మందన..!?

Anilkumar
నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ మంచి పేరు సంపాదించుకుంది రష్మిక. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ను సాధించిన ఈమె పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా ఇమేజ్ చేంజ్ దక్కించుకుంది.ప్రస్తుతం పుష్ప టు సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది రష్మిక. అయితే ఈ సినిమా రిలీజ్ అయితే ఆమె క్రేజ్ మరింత పెరిగిపోతుంది అనడంలో  సందేహం లేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు రష్మిక మందన బాలీవుడ్ లో ఒక బంపర్ ఆఫర్ కొట్టేసిందని అంటున్నారు. 

ప్రస్తుతం తెలుగుతోపాటు హిందీలో కూడా వర్ష సినిమాలో చేస్తే దూసుకుపోతోంది ఈమె.. అయితే తెలుగులో రాజమౌళి రవితేజ కాంబినేషన్ లో వచ్చిన విక్రమార్కుడు సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమాను హిందీలో రౌడీ రాథోడ్ పేరుతో రీమేక్ చేశారు. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఫలితంగా మంచి విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా ఈ సినిమాకు బాలీవుడ్ లో సీక్వెల్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలుగులో విక్రమార్కుడు సినిమాకి సీక్వెల్ రాలేదు.

కానీ హిందీలో మాత్రం ఈ సినిమా  సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇందులో హీరోగా షాహిద్ కపూర్ నటించనుండగా ప్రభుదేవా దర్శకత్వం వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కం డైరెక్టర్ సంజయ్ లీల బన్సాలి ఈ సినిమాను నిర్మించబోతున్నారట .ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన ఫిక్స్ అయిందని వార్తలు వినబడుతున్నాయి. అంతేకాదు ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతోందట. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. దాదాపుగా ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ కూడా హిట్ లను అందుకున్నాయి. ఈ సినిమా కూడా పక్క ప్లానింగ్ తో ఆయన తెరకెక్కిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: