యంగ్ హీరోయిన్ లకి పోటీగా శ్రీకాంత్ కూతురు..ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు శ్రీకాంత్ అమ్మాయిల కలల రాకుమారుడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకప్పుడు శ్రీకాంత్ సినిమాలను చూసి అందరి అమ్మాయిలు శ్రీకాంత్ లాంటి జుట్టు ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అనుకునేవారు. ఇక ఆ విషయాలను కొన్ని సందర్భాలలో చాలామంది చెప్పేవారు. ఇక అలాంటి ఒక అందరి కలల రాకుమారుడును ఊహ తన నిజ జీవితంలో కట్టి పడేసింది. వీరిద్దరూ సినిమాల్లో కలిసి జంటగా నటించారు. ఆమె సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు.

ఇక ఆ సినిమా నుండి వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. అనంతరం పెళ్లి వరకు వచ్చి ఇద్దరూ ఒకటయ్యారు. ప్రస్తుతం వీరిద్దరికీ ముగ్గురు పిల్లలు. పెద్దబ్బాయి పేరు రోషన్. ఇక రోషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెళ్లి సందడి సినిమాలో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రోషన్. రెండో అమ్మాయి మేద. ప్రస్తుతం ఈమె చదువుకుంటుంది. త్వరలోనే టాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది అన్న వార్తలు చాలా కాలంగా వినబడుతున్నాయి. ఇక ఇందులో భాగంగానే ఆమె హీరోయిన్ లకు తగ్గట్టుగానే అంతటి అందంతో మెరుస్తోంది ఈమె. 

తల్లి అందం తండ్రి పోలికలు తో చాలా చక్కగా అందంగా కనిపిస్తోంది ఈమె. ఇక మూడవ వాడు రోహన్ .అయితే ఈ ముగ్గురు పిల్లలు కూడా అచ్చం వారి తండ్రి శ్రీకాంత్ లాగానే ఉంటారు. అందుకే శ్రీకాంత్ తన ఫ్యామిలీతో ఎక్కడ కనిపించినా కూడా అన్న మీ ఇంట్లో జిరాక్స్ మిషన్ పెట్టావా అంటూ సరదాగా శ్రీకాంత్ని అందరూ ఆటపట్టేస్తూ ఉంటారు.. అయితే తాజాగా శ్రీకాంత్ కుటుంబం మొత్తం ఒక ప్రైవేట్ ఈవెంట్లో తండ్రి కొడుకులు ఒకేలాంటి పైజామా తో కనిపించగా తల్లి కూతుర్లు చీర కట్టులో మెరిసారు. ఇక గోల్డ్ రంగు చీరలో బంగారం లాగా మెరిసింది శ్రీకాంత్ కూతురు. కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసుకుపోకుండా చాలా చక్కగా ఎంతో అందంగా కనిపిస్తోంది శ్రీకాంత్ కూతురు. ఇందులో భాగంగానే శ్రీకాంత్ తన కూతురిని టాలీవుడ్కు హీరోయిన్గా పరిచయం చేస్తాడా లేదా అన్నది చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: