టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు. తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది .ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన మాస్ స్ట్రైక్ వీడియో సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో మహేష్ ఓవర్ మాస్ లుక్ లో చాలా క్రేజీగా కనబడుతున్నారు.ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఇక త్రివిక్రమ్ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్లో మరొక సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇక త్రివిక్రమ్ మరియు మహేష్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అయితే గతంలో రాజమౌళి తన నెక్స్ట్ రెండో సినిమాల్లో ఒకటి మహేష్ బాబు తోనే తీయబోతున్నట్లుగా స్పష్టం చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే.ఇక గుంటూరు కారం సినిమా విడుదలైన తర్వాత మహేష్ బాబు రాజమౌళి తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రాబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభం కానుంది .
రాజమౌళి సినిమాలంటే ఖచ్చితంగా లేట్ అవుతాయి .అయితే రాజమౌళి దర్శకత్వంలో సినిమా పూర్తయ్యేంతవరకు మహేష్ బాబు వేరే సినిమా చేయడని అంటున్నారు. అంతేకాదు రాజమౌళితో సినిమా కోసం మహేష్ బాబు తన లుక్ ని పూర్తిగా మార్చేస్తాడట. అయితే వీరిద్దరి కాంబినేషన్లో రానున్న ఈ సినిమా పూర్తయ్య వరకు కనీసం రెండు నుండి మూడు సంవత్సరాలైనా పడుతుందని అంటున్నారు. ఇక అప్పటివరకు వేరే సినిమాలకి బ్రేక్ ఇస్తాడట మహేష్ బాబు .ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి .ఇక ఈ సినిమా ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకుంటుందని ముందు నుండి ఫ్యాన్స్ ఆశపడుతున్నారు..!!