పెళ్లి చేసుకోడానికి నేను మానసికంగా సిద్ధంగా లేను : మాధవిలత

murali krishna
టాలీవుడ్ నటి మాధవీలత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తక్కువ సినిమాల్లోనే నటించినా ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ నటికి సోషల్ మీడియా లో కూడా బాగా క్రేజ్ పెరుగుతోంది.
తాజాగా ఈ నటి పెళ్లి గురించి, ఇతర ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు. ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే వయస్సు మాత్రమే సరిపోదని మాధవీలత తెలిపారు.. ఆ అమ్మాయి శారీరకంగా, మానసికంగా కూడా సిద్ధంగా ఉండాలని మాధవీలత పేర్కొన్నారు. పెళ్లి చేసుకోవడం అనేది అమ్మాయి వ్యక్తిగత నిర్ణయం అని కూడా ఆమె కామెంట్లు చేశారు. ప్రస్తుతం నేను పెళ్లికి శారీరకంగా, మానసికంగా సిద్ధంగా లేనని కూడా ఆమె చెప్పుకొచ్చారు. భవిష్యత్తుపై నాకు అస్సలు నమ్మకం లేదని మాధవీలత చెప్పుకొచ్చారు. ఇది నా నిర్ణయం అని ఇది నా జీవితం అని ఆమె కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయనే విషయం తెలిసిందే. తాను మైగ్రేన్ సమస్యతో బాధ పడుతున్నానని మాధవీలత తెలిపారు.. మాధవీలత చేసిన పోస్ట్ కు 1500 కంటే ఎక్కువగా లైక్స్ కూడా వచ్చాయి. పెళ్లి గురించి సొసైటీ నుంచి పదేపదే ప్రశ్నలు ఎదురవుతూ ఉండటంతో మాధవీలత ఈ తరహా పోస్ట్ ను పెట్టారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం విశేషం.. మాధవీలత పోస్ట్ గురించి కొంతమంది పాజిటివ్ గా కామెంట్లు చేస్తుండగా మరి కొందరు మాత్రం నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. నచ్చావులే సినిమాతో మాధవీలత టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారనే విషయం తెలిసిందే. స్నేహితుడా, అరవింద్2 సినిమాలు ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. మాధవీలత ఎంతో కష్టపడినా స్టార్ స్టేటస్ ను మాత్రం సొంతం చేసుకోలేదు. మాధవీలత వరుస ప్రాజెక్ట్ లతో బిజీ అయితే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: